Fathima Antony: నువ్వు లేకుండా జీవించలేకపోతున్నాం: ఫాతిమా
October 10, 2023 / 06:13 PM IST
|Follow Us
విజయ్ ఆంటోనీ కుమార్తె మీరా కొద్ది రోజుల క్రితం తన ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. 16 సంవత్సరాల ఈ చిన్నారి ఇలా ఆత్మహత్యకు పాల్పడటంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం విషాదఛాయలు అలముకున్నాయి. ఇలా మీరా ఆత్మహత్య చేసుకోవడంతో ఈమె ఆత్మహత్యకు గల కారణాలు గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నప్పటికీ సరైన కారణం మాత్రం తెలియడం లేదు. మీరా ఆంటోని మరణించిన తర్వాత నటుడు విజయ్ ఎక్కడికి వెళ్లినా తనతో పాటు తన చిన్న కుమార్తెను క్షణం పాటు వదిలిపెట్టకుండా తమ వెంట తీసుకువెళ్తున్నారు.
విజయ్ ఆంటోనీ భార్య ఫాతిమా కూడా ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతూ బ్యానర్ లోనికి ఎన్నో ఒక మంచి సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇలా వృత్తిపరంగా విజయ్ ఫాతిమా ఇద్దరు కూడా బిజీగా ఉన్నారు. ఇలా ఎంత సంతోషంగా సాగిపోతున్నటువంటి వీరి జీవితంలోకి మీరా ఆత్మహత్య పెను విషాదంలా వచ్చి పడింది. ఇలా తన కూతురు మరణించడంతో ఈ దంపతులు ఇంకా ఆ వార్త నుంచి బయటపడలేదని తెలుస్తోంది.
తాజాగా ఫాతిమా ఆంటోనీ (Fathima Antony) తన కుమార్తె మీరా మరణం గురించి తలుచుకొని సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. నువ్వు 16 సంవత్సరాలు మాత్రమే జీవిస్తానని తెలిసి ఉంటే నిన్ను మరింత దగ్గరగా తీసుకునే దాన్ని. కనీసం ఆ సూర్యచంద్రులకు కూడా నిన్ను చూపించేదాన్ని కాదు.
ప్రస్తుతం నువ్వు మా మధ్యన లేకపోవడంతో తరచూ నీ జ్ఞాపకాలలో జీవిస్తున్నాము. నువ్వు లేకుండా జీవించడం చాలా కష్టంగా ఉంది. తిరిగి ఈ అమ్మానాన్న దగ్గరికి వచ్చేయి మీరా… నీకోసం నీ చెల్లె కూడా ఎదురు చూస్తూ ఉంది లవ్ యు తంగం అంటూ ఈమె తన కూతురి మరణాన్ని గుర్తుచేసుకొని సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఈ ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతుంది.