పోరాటాల చిత్రీకరణలో “పోలీస్ వారి హెచ్చరిక”

  • January 8, 2024 / 01:14 PM IST

అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మిస్తున్న””పోలీస్ వారి హెచ్చరిక”” చిత్రం ప్రస్తుతం పోరాట సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటుంది…..!

పాన్ ఇండియా నటుడు రవి కాలె, అజయ్ ఘోష్, సంజయ్ నాయర్, అఖిల్ సన్నీ లతో పాటు హీరో హీరోయిన్ ల బృందం పై టాలీవుడ్ స్టూడియో, చిత్రమందిర్ స్టూడియో, చందానగర్, బీరంగూడా, ఘణ పూర్, షామీర్ పేట లలో భారీగా వేసిన సెట్స్ లో ప్రముఖ ఫైట్ మాస్టర్ “సింధూరం సతీష్ ” నేతృత్వంలో ఫైట్ సన్నివేశాలను చిత్రీకరించామని”.

“అక్టోబర్ 23 న ప్రారంభమైన యీ సినిమా చిత్రీకరణను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేస్తున్నామని, ఇప్పటివరకు జరిగిన షూటింగ్ లో 80 శాతం టాకీ పార్ట్ తో పాటు ఫైట్స్ సన్నివేశాల చిత్రీకరణ ను పూర్తి చేశామని, జనవరి నెలాఖరు నాటికి మిగతా సన్నివేశాలతో పాటు పాటల చిత్రీకరణను కూడా పూర్తి చేసి షూటింగ్ కార్యక్రమాన్ని ముగిస్తామని”
బాబ్జీ పేర్కొన్నారు…!!

చిత్ర నిర్మాత బెల్లి జనార్థన్ మాట్లాడుతూ : భారత సైన్యం లో పనిచేసి వచ్చిన తనకు యుద్ధరంగం లో సైనికులకు ఉండే క్రమశిక్షణ సినిమా రంగంలో పనిచేసే టెక్నీషియన్స్ దగ్గర కనిపించిందని, టైం మేయింటేనేన్స్ అనేది సినిమా పరిశ్రమకు ఉన్న గొప్ప గుణమని తనకు అర్థమైందని. ఈ రంగంలో పొందిన స్పూర్తితో భవిష్యత్ లో కూడా సినిమా నిర్మాణాన్ని ఇలాగే కొనసాగిస్తూ సినిమా రంగంలోనే ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపారు…..!!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags