ఈ ఏడాది క్యూ కడుతున్న సినిమా వారసులు

  • January 27, 2022 / 10:20 AM IST

సినిమా పరిశ్రమలో వారసులు… ఈ టాపిక్‌ మీద ఎప్పటి నుండో చర్చ నడుస్తూనే ఉంది. అలానే వారసుల రాక కూడా కొనసాగుతూనే ఉంది. నటుల వారసులు వస్తుంటారు అలాగే నిర్మాతలు, దర్శకుల వారసులు వస్తుంటారు. ఏదేమైనా ఏటా ఇలాంటి హీరోలు ఇండస్ట్రీకి పరిచయమవుతూనే ఉంటారు. తాజాగా సంక్రాంతికి ఇద్దరు హీరోలు ఇలా పరిశ్రమలోకి వచ్చారు. ఇద్దరూ నిర్మాతల తనయులే. వీళ్లే కాదు. ఈ వరుసలో చాలామంది ఉన్నారు. వాళ్ల సంగతి ఓ సారి చూద్దాం.

* సంక్రాంతికి విడుదలైన సినిమాలు ‘హీరో’, ‘రౌడీ బాయ్స్‌’. ఈ సినిమాలతో వచ్చిన అశోక్‌ గల్లా, ఆశిష్‌ రెడ్డి ఇద్దరూ నిర్మాతల తనయులే. గల్లా పద్మావతి – గల్లా జయదేవ్‌ తనయుడు అశోక్‌. ఇక దిల్‌ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్‌ రెడ్డి. ఈ రెండు సినిమాల ఫలితం పక్కన పెడితే హీరోలుగా మాత్రం ఈ ఇద్దరికీ మంచి మార్కులే పడ్డాయి.

* వీరిద్దరూ కాకుండా ఈ ఏడాది నిర్మాత తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న మరో కథానాయకుడు అభిరాయ్‌. దగ్గుబాటి సురేశ్‌ రెండో కొడుకు ఈ అభిరామ్‌. తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా కోసం ‘అహింస’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారట.

* బెల్లంకొండ ఫ్యామిలీ నుండి ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ వచ్చాడు. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు అదే కుటుంబం నుండి బెల్లంకొండ గణేశ్‌ వస్తున్నాడు. ‘స్వాతిముత్యం’ అనే సినిమాతో హీరోగా సినీప్రియుల్ని పలకరించనున్నాడు బెల్లంకొండ గణేష్‌.

* ‘బేకర్‌ అండ్‌ బ్యూటీ’, ‘త్రీరోజెస్‌’, ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వంటి వెబ్‌ సిరీస్‌లతో ప్రేక్షకుల్ని అలరించాడు సంగీత్‌ శోభన్‌. దర్శకుడు శోభన్‌ తనయుడు. ఇప్పటికే శోభన్‌ పెద్ద కుమారుడు సంతోష్‌ శోభన్‌ హీరోగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. సంగీత్‌ త్వరలో ప్రముఖ నిర్మాణ సంస్థ తెరకెక్కించనున్న సినిమాతో వెండితెరపై అడుగుపెట్టనున్నట్లు సమాచారం.

మరి వీరిలో ఎవరు అలరిస్తారు, రాణిస్తారో చూడాలి. వారసులు అంటే కేవలం నట వారసత్వం కాదు అని గతంలో కొంతమంది నిరూపించారు. అయితే వాళ్ల సంఖ్య తక్కువే. మరి ఈ యువ హీరోలు ఏ మేరకు వావ్‌ అనిపిస్తారో చూద్దాం.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus