Filmfare Awards: ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వచ్చేశాయ్… మీకు నచ్చిన సినిమాకు ఎన్ని వచ్చాయంటే?
January 29, 2024 / 10:49 AM IST
|Follow Us
అనుకున్నదే జరిగింది… 2023 ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో భార్యాభర్తలే ఉత్తమ నటులుగా నిలిచారు. అలా అని వాళ్లేం ఈజీగా ఆ అవార్డులు ఏం సంపాదించలేదు. ఆయా సినిమాల్లో ఇద్దరి నటన, లుక్ చూస్తే కచ్చితంగా అవార్డులు వస్తాయని అందరూ అనుకుంటారు. అదే జరిగింది కూడా. బాలీవుడ్లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఫిల్మ్‌ఫేర్ అవార్డుల జాబితా వచ్చేసింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో సాగిన ఈ వేడుకలో విజేతలకు పురస్కారాలను అందించారు. 2023లో విడుదలైన చిత్రాలకుగాను ఈ అవార్డులు ప్రకటించారు.
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమాకు అవార్డుల పంట పండింది. అదే సినిమాలోని నటనకుగాను రణ్‌బీర్ కపూర్ ఉత్తమ నటుడుగా నిలవగా ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ సినిమాకుగాను అలియా భట్ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. ‘12th ఫెయిల్’ సినిమా ఉత్తమ చిత్రంగా నిలవగా, ఆ సినిమా దర్శకుడు విధు వినోద్ చోప్రా బెస్ట్ డైరెక్టర్‌గా నిలిచారు. ఫిల్మ్ ఫేర్ 2023 అవార్డుల (Filmfare Awards) జాబితా ఇదే..
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): జొరామ్, ఉత్తమ నటుడు (క్రిటిక్స్): విక్రాంత్ మెస్సె (12th ఫెయిల్), ఉత్తమ నటి (క్రిటిక్స్): రాణీ ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ vs నార్వే), షెఫాలీ షా (త్రీ ఆఫ్ అజ్), ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్ (డంకీ), ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ), ఉత్తమ గీత రచయిత: అమితాబ్ భట్టాచార్య (జరా హత్కే జరా బచ్కే – తెరె వాస్తే) నిలిచారు. ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్‌గా ‘యానిమల్’, ఉత్తమ నేపథ్య గాయకుడు: భూపిందర్ బాబల్ (అర్జన్ వెయిలీ – యానిమల్), ఉత్తమ నేపథ్య గాయకురాలిగా శిల్పా రావు (చెలెయా – జవాన్) నిలవగా…
ఉత్తమ కథ పురస్కారం అమిత్ రాయ్ (OMG 2)కు వచ్చింది. ఉత్తమ సంగీత పురస్కారం యానిమల్ సినిమాకు గాను ప్రీతమ్, విశాల్ మిశ్రా, మన్నన్ భరద్వాజ్, శ్రేయాస్ పురానిక్, జానీ, భూపిందర్ బాదల్, అశిమ్ కెమ్సన్, హర్షవర్ధన్ రామేశ్వర్, గురిందర్ సెహగల్ అందుకున్నారు. బెస్ట్ వీఎఫ్ఎక్స్ అవార్డు జవాన్ సినిమాకు గాను రెడ్ చిల్లీస్ VFXకు దక్కింది. రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ సినిమాలోని ‘వాట్ ఝుమ్కా..’ పాటకు ఉత్తమ కొరియోగ్రఫీ పురస్కారాన్ని గణేష్ ఆచార్య అందుకున్నారు.