Kalki 2898 AD: వామ్మో.. ‘కల్కి 2898 AD’ కోసం అన్ని గంటలు థియేటర్లో కూర్చోవాలా?
June 1, 2024 / 08:52 PM IST
|Follow Us
ప్రభాస్ (Prabhas), దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్లో ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) అనే భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతుంది. జూన్ 27 న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో కూడా రిలీజ్ కాబోతోంది. ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్ (C. Aswani Dutt) తన కూతుర్లు స్వప్న దత్ (Swapna Dutt) , ప్రియాంక దత్ (Priyanka Dutt) ..లతో కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతుంది.
ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, బుజ్జి అనే కార్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే బుజ్జి, భైరవ పాత్రలను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన యానిమేటెడ్ వెబ్ సిరీస్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇదిలా ఉండగా.. ‘కల్కి 2898 ad ‘ అనేది చాలా పెద్ద కథట. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్లు కూడా నటిస్తున్నారు. ప్రభాస్ తో పాటు వాళ్ల పాత్రలకు కూడా ఓ బ్యాక్ స్టోరీస్ ఉంటాయట.
సో సినిమా రన్ టైం తక్కువగా ఉండే ఛాన్స్ అయితే లేదు. అలాగని దీనికి సెకండ్ పార్ట్ ఉంటుందని ఇంకా ప్రకటించింది లేదు. దీంతో ‘కల్కి 2898 ad ‘ రన్ టైం గురించి కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ‘కల్కి 2898 ad’ రన్ టైం 2 గంటల 51 నిమిషాలు వచ్చిందట. సో ఈ సినిమా కోసం ప్రేక్షకులు 3 గంటల పాటు థియేటర్లలో కూర్చోవాల్సిందే.