Nagarjuna: మొత్తానికి ‘బంగార్రాజు’ రంగంలోకి దిగుతున్నాడు..!

  • July 20, 2021 / 11:00 AM IST

‘బంగార్రాజు’.. ఈ పేరుని 2016 నుండీ ప్రేక్షకులు వింటున్నారు. ఏళ్ళు గడిచిపోయాయి. ఇదిగో ‘బంగార్రాజు’.. అదిగో ‘బంగార్రాజు’ అంటూ నాగ్ టీం చెబుతుంది కానీ.. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన కథలికలు కొంచెం కూడా మొదలుకాలేదు.నాగార్జున కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన ‘సోగ్గాడే చిన్నినాయనా’కి సీక్వెల్ గానో.. ప్రీక్వెల్ గానో ఈ మూవీ తెరకెక్కాల్సి ఉంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల స్క్రిప్ట్ కి నాగార్జున వంకలు పెడుతూ రావడం వలన ఈ ప్రాజెక్టు లేట్ అవుతూ వచ్చిందని ఇన్సైడ్ టాక్.

ఐతే ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ మొదలుకాబోతుందని లేటెస్ట్ టాక్. ఇందులో డౌట్ పడాల్సింది ఏమీ లేదు. హీరోయిన్లను ఎంపిక చేసుకునే ప్రక్రియ కూడా మొదలైంది. ఇందులో భాగంగా నాగ చైతన్య సరసన ‘ఉప్పెన’ బ్యూటీని సంప్రదించారు. కానీ ఆమె కాల్ షీట్లు అడ్జస్ట్ చేయలేక నొ చెప్పింది. వచ్చే నెలాఖర్లో అంటే ఆగష్ట్ చివర్లో ‘బంగార్రాజు’మొదలుకాబోతుంది.బౌండ్ స్క్రిప్టు రెడీగా ఉండడంతో నాగ్ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. సత్యానంద్‌ మెయిన్ రైటర్ గా మరికొంతమందిని కో రైటర్స్ గా ఎంపికైనట్టు సమాచారం.

అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. 2022 సంక్రాంతికే ఈ చిత్రాన్ని రంగంలోకి దించాలని నాగార్జున భావిస్తున్నారు. ఇక ఎటువంటి డిలే ఉండదని కూడా యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే నాగార్జున అభిమానులు మాత్రం ఇంకా ఈ ప్రాజెక్టు పై అనుమానాలు వ్యక్తం చేస్తుండడం గమర్హం.

Most Recommended Video



పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus