Reba Monica John: ‘సామజవరగమన’ బ్యూటీ ఇక నుండి అయినా బిజీ అవుతుందా?

  • January 7, 2024 / 05:40 PM IST

రెబా మోనికా జాన్… వినడానికి ఈ పేరు కొత్తగా ఉందేమో కానీ.. తెలుగు ప్రేక్షకులకి ఈమె బాగా దగ్గరైన హీరోయినే అని చెప్పాలి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, అట్లీ కాంబినేషన్లో వచ్చిన ‘విజిల్’ మూవీలో అనిత అనే పాత్రలో నటించి పాపులర్ అయ్యింది. ఆ సినిమాలో ఈమె ఫుట్ బాల్ ప్లేయర్ గా నటించింది. అందులో ఓ కుర్రాడు ప్రేమించమని వెంటపడుతూ చివరికి మొహం పై యాసిడ్ పోస్తే .. ముఖం కాలిపోయి ఫుట్ బాల్ గేమ్ కి దూరమయ్యే అమ్మాయిగా ఈమె మంచి నటన కనపరిచింది.

ఆ తర్వాత విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన ‘భూ’ అనే సినిమాలో కూడా నటించింది. ఆ సినిమాలో ఈమె మాయ అనే దెయ్యం పాత్రలో కనిపించింది. ఇక గత ఏడాది వచ్చిన ‘సామజవరగమన’ సినిమాలో శ్రీ విష్ణు సరసన నటించి ఇంకా పాపులర్ అయ్యింది. ‘సామజవరగమన’ సక్సెస్ తో ఈమెకి వరుస ఆఫర్లు రావడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమి జరగలేదు.

మొత్తానికి ఇప్పుడు ఓ ఆఫర్ పట్టింది ఈ అమ్మడు. వివరాల్లోకి వెళితే.. శర్వానంద్ హీరోగా ‘మ్యాడ్’ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయినే గా రెబా మోనికా జాన్ ని ఎంపిక చేసుకున్నారు అని సమాచారం. మరి ఈ సినిమాతో అయినా ఆమె దశ తిరుగుతుందేమో చూడాలి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus