కొన్నాళ్లక్రితం కన్నడ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు తీవ్ర దుమారం రేపింది. ఈ కేసులో నటి సంజనా గల్రానీను అధికారులు అదుపులో తీసుకున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ స్కామ్ లో ఆమె ఇన్వాల్వ్ అయిందని రుజువు కావడంతో ఆమెకి కోర్టు జైలు శిక్ష కూడా విధించింది. ప్రస్తుతం ఆమె బెయిల్ పై బయటకొచ్చింది. అయితే తాజాగా సంజనా మరోసారి చిక్కుల్లో పడింది. తనపై సంజనా దాడి చేసిందంటూ ఓ మహిళా ప్రొడ్యూసర్ పోలీస్ కేసు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.
2019 క్రిస్మస్ వేడుకల్లో జరిగిన ఓ ఘర్షణలో తన కళ్లకు గాయం చేసిందంటూ సినీ నిర్మాత వందన జైన్ పోలీస్ కేసు పెట్టారు. తన ముఖంపై సంజన విస్కీ పోసి కంటికి గాయం చేశారని ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. లావెల్లె రోడ్డులోని కేజ్ క్లబ్‌లో జరిగిన ఓ పార్టీలో వందన జైన్ పాల్గొన్నారు. అదే పార్టీకి సంజనా కూడా తన స్నేహితుడితో వచ్చింది. రాత్రి 11 గంటల సమయంలో మ్యూచువల్ ఫ్రెండ్ తో మాట్లాడడానికి వందన.. సంజనా టేబుల్ దగ్గరకు వెళ్లింది. అయితే సంజనా ఆవేశంతో వందన గురించి తప్పుగా మాట్లాడడమే కాకుండా.. అక్కడున్న విస్కీ గ్లాస్ తో ఆమె ముఖంపై దాడి చేసిందని వందన తరఫు లాయర్ చెబుతున్నారు.
గతేడాది లాక్ డౌన్ ఉన్న కారణంగా ఈ ఘటనపై కేసు నమోదు చేయడం ఆలస్యం అయిందని ఆయన వెల్లడించారు. కబ్బన్ పార్క్ పోలీసులు ఐపిసి సెక్షన్లు 326 ఎ – యాసిడ్ దాడి.. 335 – స్వచ్ఛందంగా తీవ్రమైన బాధ లేదా రెచ్చగొట్టడం.. 323 – దాడి 324 – ప్రమాదకరమైన ఆయుధాలను ఉపయోగించి దాడి.. 506 – క్రిమినల్ బెదిరింపు .. 504 – ఉద్దేశపూర్వక అవమానం కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇంకా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని లాయర్ చెబుతున్నారు.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!