లేనిపోని చర్చలకు పోతే… అసలుకే మోసం

  • June 27, 2021 / 11:42 AM IST

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలకు చాలా సమయం ఉంది. కచ్చితంగా చెప్పాలంటే ఓ మూడు నెలల సయమం ఉంది. కానీ తొందపడిందో లేక ప్లాన్‌ వేసిందో కానీ ఓ కోయిల ముందే కూసేసింది. ఆ వెంటనే మిగిలిన కోయిలలు కూసేశాయి. దీంతో ఎన్నికల వేడి అప్పుడే మొదలైపోయింది. అయితే వాటికి ఆజ్యం పోసేలా కొంతమంది ముందుకొస్తున్నారు. కావాలని చేస్తున్నారో, లేక ఏదో కావాలని చేస్తున్నారో కానీ, వాళ్ల మాటలు టాలీవుడ్‌ నటుల్లో లేనిపోని పరిస్థితులకు కారణాలు అవుతున్నాయి. ఇలాంటివారిని సాధారణ రాజకీయాల్లో ఫైర్‌ బ్రాండ్‌లు అంటారు. ఇక్కడ కూడా అలానే అంటే… కచ్చితంగా వారిని పక్కన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రస్తుతం ‘మా’ ఎన్నికల్లో పోటీలో ఉన్నవాళ్ల లిస్ట్‌ చూసుకుంటే ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్‌, హేమ. వీళ్లంతా మంచి నటులనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏదో సందర్భంలో తమలోని ఫైర్‌ను బయటపెట్టి ఫైర్‌ బ్రాండ్స్‌గా పేరు తెచ్చుకున్నవాళ్లే. అయితే వీళ్లు ప్రస్తుతం కూల్‌గానే ఉన్నారు. అయితే వాళ్ల చుట్టూ ఫైర్‌బ్రాండ్‌లు చేరుతున్నారు. వాళ్లతోనే ఇప్పుడు సమస్య వస్తోంది. వాళ్లను కూల్‌ చేయకపోతే ‘మా’ ఎన్నికలు ఈ సారి కూడా ఫైర్‌ మీదే కొనసాగేలా కనిపిస్తాయి.

ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లో సీనియర్‌, జూనియర్‌ నటుల మేళవింపు కనిపిస్తోంది. అందులో బండ్ల గణేశ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొన్నటి ప్రెస్‌ మీట్‌లో ప్రభాస్‌, రాజమౌళి లాంటివాళ్ల పేర్లు తీసుకొచ్చి అనవసర రచ్చ చేశాడు. మధ్యలో మీడియాను కూడా ఆడిపోసుకున్నాడు. అయితే ఆఖరులో తన మీదన తాను పంచ్‌ వేసుకున్నాడు. ఇలాంటి మాటలు వేడిని పెంచుతాయి. మరోవైపు నరేశ్‌- జీవిత రాజశేఖర్‌ శనివారం నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో నటి కళ్యాణి ఇదే పరిస్థితి. ‘కమిటీ ఫోర్స్‌లో ఉన్నప్పుడు అందులోని సభ్యులు కొత్త ప్యానల్‌లో చేరడం తప్పు. వాళ్లని సస్పెండ్‌ చేయాలి. ‘మా’ మసకబారిపోయిందంటూ వ్యాఖ్యానించడం తప్పు’ అంటూ ఆమె మాట్లాడారు.

వీళ్లంతా ఒకలా ఉంటే… కాంట్రవర్శికీ కేరాఫ్‌ అడ్రెస్‌ అయిన రామ్‌గోపాల్‌ వర్మ మరోవైపు. నాన్‌లోకల్‌ అనే మాటను పట్టుకొని ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ లాంటివారిని ఇందులోకి లాగారాయన. ఇంకా ఎన్నికలకు మూడు నెలల సమయం ఉంది. ఈ సమయంలో చర్చ వద్దనుకొని ప్రకాశ్‌రాజ్‌ తమ ప్యానల్‌ సభ్యులు మీడియా ముందుకు వెళ్లొద్దు అని చెప్పారు. దాంతోపాటు తమలోని ఫైర్‌ బ్రాండ్స్‌ను కూడా కంట్రోల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. మిగిలిన ప్యానల్‌ లీడ్‌ చేయాలనుకునేవాళ్లూ ఈ పని చేయడం ఎంతైనా అవసరం.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus