Unstoppable Talk Show: బాలయ్య షోకు రాబోయే మొదటి గెస్ట్ ఎవరంటే?

  • October 21, 2021 / 05:58 PM IST

నందమూరి బాలకృష్ణ ఓటీటీ మార్కెట్లోకి సరికొత్తగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఏదైనా వెబ్ సిరీస్ తో షాక్ ఇస్తాడు అనుకుంటే ఆయన ఎవరూ ఊహించని విధంగా ఒక డిఫరెంట్ షోతో సిద్ధమవుతున్నారు. అన్ స్టాపబుల్ అనే ఆహా షోకు రాబోయే గెస్ట్ లు ఎవరు అనే విషయంలో కూడా ఇప్పటికీ నిర్వాహకులు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇక షో కు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ షూటింగ్ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

దీపావళి సందర్భంగా మొదటి ఎపిసోడ్ ను విడుదల చేయబోతున్నారు. ఇక మంచు మోహన్ బాబు బాలయ్యతో మొదటి సారి ఈ షోలో పాల్గొన్నబోతున్నట్లు సమాచారం ఇటీవల లాంచ్ ఈవెంట్ తోనే షో ఎలా కొనసాగుతుందో క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఆ విషయంలో కూడా అల్లు అరవింద్ కి ఒక ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. మోహన్ బాబు తో మొదలు పెట్టే ఆ ప్రత్యేకమైన ఎపిసోడ్ ను దీపావళి సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కేవలం సినీ తారలు మాత్రమే కాకుండా దర్శకులు నిర్మాతలు కూడా ఈ ప్రత్యేకమైన షోలు పాల్గొంటారని తెలుస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తేజ్ కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు టాక్ అయితే వస్తుంది. మరి ఆ న్యూస్ ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus