హీరో నిఖిల్ సిద్ధార్థ లాంచ్ చేసిన ‘చైనా పీస్’ ఫస్ట్ లుక్ పోస్టర్

  • January 26, 2024 / 02:17 PM IST

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్‌ ప్రధాన పాత్రలలో అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “చైనా పీస్”. రిపబ్లిక్ డే సందర్భంగా పాన్ ఇండియా స్టార్ హీరో నిఖిల్ సిద్ధార్థ ఈ చిత్రం ఫస్ట్ లుక్, హై కాన్సెప్ట్ పోస్టర్‌ను లాంచ్ చేశారు.

లిప్‌స్టిక్ , యుఎస్ బీ డ్రైవ్ ఇమేజ్ కాంబినేషన్ ని మిక్స్ చేస్తూ ఆసక్తికరంగా చూపిస్తూ ఒక మిసైల్ ని పోలివున్న ఈ పోస్టర్‌ చాలా క్యురియాసిటీని పెంచింది. దేశభక్తి, భారతదేశం-చైనా సంబంధాల ఇతివృత్తంతో ఈ కథ ఉండబోతుందని పోస్టర్ సూచిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఒక డిఫరెంట్ సినిమాటిక్ జర్నీని ప్రామిస్ చేస్తోంది.

మూన్ లైట్ డ్రీమ్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో హర్షిత, శ్రీషా నూలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. సురేష్ రగుతు డివోపీ కాగ, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్.

తారాగణం: నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్, హర్షిత, శ్రీషా నూలు, శ్రీకాంత్ అయ్యంగార్, కమల్ కామరాజు, తులసి, రంగస్థలం మహేష్, వంశీ నెక్కంటి, వడ్లమాని శ్రీనివాస్, దీక్షా పంత్, వినోద్ సాగర్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: అక్కి విశ్వనాధ రెడ్డి
బ్యానర్: మూన్ లైట్ డ్రీమ్స్
సినిమాటోగ్రాఫర్: సురేష్ రగుతు
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
కాస్ట్యూమ్ డిజైనర్: మహి డేరంగుల
ఫైట్స్: మాస్టర్ అంజి
పీఆర్వో: తేజస్వి సజ్జా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus