NTR, Uday Kiran: ఎన్టీఆర్ తో మూడు సార్లు పోటీ పడ్డ ఉదయ్ కిరణ్ .. ఫలితం ఏమయ్యిందంటే..?
July 16, 2022 / 11:39 AM IST
|Follow Us
ఉదయ్ కిరణ్.. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ‘చిత్రం’ ‘నువ్వు నేను’ ‘మనసంతా నువ్వే’ వంటి చిత్రాలతో అతను స్టార్ హీరో అయిపోయాడు. మరోపక్క ఎన్టీఆర్ కూడా ‘నిన్ను చూడాలని’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ‘స్టూడెంట్ నెంబర్ 1’ ‘ఆది’ చిత్రాలతో స్టార్ గా ఎదిగాడు. ఎన్టీఆర్ కంటే ఉదయ్ కిరణ్ కొంచెం ముందుగానే స్టార్ అయ్యాడు.అయితే ఆ టైంలో ఎన్టీఆర్ కు నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా.. నందమూరి అభిమానుల సపోర్ట్ అయితే ఎక్కువగానే ఉంది.
ఈ ఇద్దరు హీరోలు ఆ టైంలో కొన్నాళ్లపాటు ఇండస్ట్రీని శాసించారు అనే చెప్పాలి. వీళ్ళ సినిమాలు వస్తున్నాయి అంటే అప్పటి స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోల సినిమాలను కూడా పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. అయితే అటు తర్వాత ఈ ఇద్దరి హవా తగ్గింది. ఎన్టీఆర్ కి ‘సింహాద్రి’ పడటం వలన అతని ఇమేజ్ కాపాడుకుంటూ వచ్చాడు. కానీ ఉదయ్ కిరణ్ కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది.
ఒకప్పుడు ఓ ఊపు ఊపేసిన ఈ స్టార్లు.. మూడు సార్లు తమ సినిమాతో పోటీపడ్డారు అనే విషయం ఎక్కువమందికి తెలిసుండదు. 2006 డిసెంబర్ 22న ఎన్టీఆర్ ‘రాఖీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఎన్టీఆర్. దీని తర్వాత రోజున అంటే డిసెంబర్ 23న ఉదయ్ కిరణ్ ‘అబద్ధం’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కె.బాలచందర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా ఈ సినిమా ప్లాప్ అయ్యింది. 2012లో… ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంటా’ చిత్రంతో ఏప్రిల్ 20న ఉదయ్ కిరణ్ వస్తే….
దానికి వారం రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 27న జూనియర్ ఎన్టీఆర్ ‘దమ్ము’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు కానీ.. బోయపాటి – ఎన్టీఆర్ క్రేజ్ వల్ల ‘దమ్ము’ యావరేజ్ గా నిలిచింది. 2013 లో … ఏప్రిల్ 5న ‘బాద్ షా’ అంటూ ఎన్టీఆర్ వస్తే, ఏప్రిల్ 11న ‘జై శ్రీరామ్’ అంటూ ఉదయ్ కిరణ్ వచ్చాడు. ఈసారి కూడా ఎన్టీఆర్ ఉదయ్ కిరణ్ సినిమా పై పైచేయి సాధించిన సంగతి తెలిసిందే.