ఉన్నట్లుండి నిన్న ఉదయం నుంచి హైద్రాబాద్ లోని ఫిలిమ్ నగర్, జూబ్లీ హిల్స్ ఏరియాల్లో అల్లు అర్జున్ ఫోటోలతో కొన్ని బ్యానర్లు కనిపించాయి. మొదట ఏవో సినిమాకి సంబంధించిన లేదా ఫ్యాన్స్ పెట్టిన పోస్టర్స్ అనుకొన్నారు జనాలు. కానీ అది చదివినవాళ్లు మాత్రం షాక్ అయ్యారు. ఆ బ్యానర్ లో ఉన్న కంటెంట్ ఏమిటంటే.. “తెలుగు సినీ ప్రేక్షకులు ఇతనిని హీరోగా పోషిస్తున్నారు కానీ.. ఇతను మాత్రం (మాతృ) తెలుగు సినీ కార్మికుల పొట్టకొడుతున్నారు. ఎందుకు??” ఇట్లు తెలుగు సినీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. అని రాసి ఉండడం చర్చనీయాంశం అయ్యింది. ఈ సినీ కార్మికులు ఎవరు అనేది ఎవరికీ తెలియదు. అర్ధరాత్రి ఎవరో ఈ బ్యానర్లు కట్టేసి వెళ్ళిపోయారు. తెలుగు చిత్రసీమలోనే సీనియర్ మోస్ట్ ప్రొడక్షన్ హౌస్ అయిన గీతా ఆర్ట్స్ కి వారసుడు అయిన అల్లు అర్జున్ మీద ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది పెద్ద సెన్సేషనే.
అయితే.. అల్లు అర్జున్ చేసిన అన్యాయం ఏమిటి అనేది ఎవరూ ఇప్పటివరకు చెప్పలేదు. అల్లు అర్జున్ టీం మాత్రం ఇదంతా కేవలం అల్లు అర్జున్ మీద బురదజల్లడానికి చేస్తున్న పిచ్చి ప్రయత్నం అని కొట్టిపాడేశారు. అసలు ఈ బ్యానర్లు కట్టింది ఎవరు? దాని వెనుక కారణం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానం తెలిస్తే ఈ గొడవల గురించి ఒక క్లారిటీ వస్తుంది.
బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?