Vaishnav Tej, Sai Tej: ‘కందిరీగ’ దర్శకుడు ఆ మెగా హీరోల పై కన్నేశాడా?

  • July 5, 2022 / 07:24 PM IST

అప్పుడెప్పుడో రామ్ తో ‘కందిరీగ’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ రూపొందించిన ఈ చిత్రం రామ్ కెరీర్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రామ్ అంత మాస్ హిట్టు కొడతాడు అని ఆ టైంలో ఎవ్వరూ ఊహించలేదు. అందుకే సంతోష్ కు ఎన్టీఆర్ తో ‘రభస’ చేసే అవకాశం దక్కింది. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ మూవీ వల్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా బాగా హర్ట్ అయ్యారు.

దీంతో మళ్ళీ రామ్ తో ‘హైపర్’ ,బెల్లంకొండ సురేష్ పెద్దబ్బాయి సాయి శ్రీనివాస్ తో ‘అల్లుడు అదుర్స్’ వంటి చిత్రాలు చేసే అవకాశం దక్కింది.అవి కూడా డిజాస్టర్లే..! ఓ రకంగా సంతోష్ చాలా అదృష్టవంతుడు అనే చెప్పాలి. ఎందుకంటే వరుసగా అతను ప్లాప్ సినిమాలు ఇస్తున్నా సరే మంచి హీరోలను పట్టడంలో అతను సక్సెస్ అవుతూనే ఉన్నాడు. ఒకానొక టైంలో పవన్ కళ్యాణ్ తో ‘తేరి’ రీమేక్ చేయబోతున్నాడు అని కూడా కామెంట్లు వినిపించాయి.

ఆ రీమేక్ సంగతి ఎలా ఉన్నా.. పవన్ కళ్యాణ్ ఇతనికి ఛాన్స్ ఇవ్వడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనేది ఇన్సైడ్ టాక్. ప్రస్తుతానికైతే సంతోష్ మెగా మేనల్లుళ్లపై కన్నేసినట్టు వినికిడి. సాయి ధరమ్ తేజ్ లేదా వైష్ణవ్ తేజ్.. వీరిద్దరిలో ఒకరితో సంతోష్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు.నాని వంటి మిగిలిన హీరోలు ఇతనితో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కాబట్టి వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లే.. ఛాన్స్ లు ఇవ్వాలి.

వీరిలో వైష్ణవ్ 3 సినిమాలు కంప్లీట్ చేయాల్సి ఉంది.కాబట్టి వైష్ణవ్ తో కష్టం. సాయి ధరమ్ తేజ్ కూడా రెండు సినిమాలు ఫినిష్ చేయాలి. అయినా జాలిపడి మరీ ఇతను ప్లాప్ డైరెక్టర్లకి అవకాశాలు ఇచ్చేస్తూ ఉంటాడు.కాబట్టి సంతోష్ కి.. సాయి ధరమ్ తేజ్ తో సినిమా చేసే అవకాశం ఎక్కువగా ఉంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus