Anushka: ఆ పేరు వల్ల ఇబ్బంది పడ్డానంటున్న అనుష్క!

  • November 8, 2021 / 10:39 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో అనుష్క ఒకరు కాగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో అనుష్క పాపులారిటీని సంపాదించుకున్నారనే విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయని అనుష్క యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రకటన వెలువడింది. త్వరలో అనుష్క ప్రధాన పాత్రలో మరికొన్ని సినిమాలకు సంబంధించిన ప్రకటనలు కూడా వెలువడే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. అనుష్క అభిమానులలో చాలామంది అనుష్క నిక్ నేమ్ స్వీటీ అని అనుకుంటారు.

అయితే అనుష్క అసలు పేరు స్వీటీ కావడం గమనార్హం. తాను ఇంటర్ లో అడ్మిషన్ తీసుకునే సమయంలో తన పేరు స్వీటీ అని రాశానని అయితే అక్కడున్న వాళ్లు ముద్దుపేరు కాదు అసలు పేరు రాయాలని చెప్పడంతో అదోలా అనిపించిందని అనుష్క పేర్కొన్నారు. సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత తనను స్వీటీ అని పిలవడానికి కొంతమంది ఇబ్బంది పడ్డారని అనుష్క చెప్పుకొచ్చారు. ఆ సమయంలో పేరు మార్చుకోవాలని భావించి అనుష్క అని పెట్టుకున్నానని ఆ విధంగా తన పేరు మారిందని అనుష్క పేర్కొన్నారు.

అనుష్క అనే పేరును తాను పెట్టుకున్నా అనుష్క పేరుతో పిలిస్తే పలకడానికి చాలా సమయం పట్టేదని అనుష్క చెప్పుకొచ్చారు. సంవత్సరం తర్వాత ఈ పేరు తనకు అలవాటైందని ఆమె వెల్లడించారు. విక్రమార్కుడు సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న అనుష్క అరుంధతి, బాహుబలి, భాగమతి సినిమాలతో కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus