Mahesh Babu: మహేష్ ఒంటరైనట్టేనా… ఇక మహేష్ కెరీర్ ఎలా ఉండబోతుంది?
November 16, 2022 / 10:04 AM IST
|Follow Us
సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు మహేష్. నిజానికి మహేష్ ను హీరోని చేయాలి అనే ఆలోచన కృష్ణ గారికి మొదట లేదు. ఆయన తర్వాత రమేష్ బాబు పెద్ద హీరో అవుతాడు అని ఆయన ఆశించారు. కానీ రమేష్ బాబు అంతగా క్లిక్ అవ్వలేదు. మహేష్ బాబు చిన్నప్పుడే తన నటనతో మెప్పించడం మొదలుపెట్టాడు. రమేష్ బాబు హీరోగా నిలదొక్కుకోలేకపోవడంతో మహేష్ ను హీరోని చేయాలని కృష్ణగారు భావించారు. ప్రేక్షకులు కూడా మహేష్ ను యాక్సెప్ట్ చేశారు.
‘రాజకుమారుడు’ నుండి ‘టక్కరి దొంగ’ వరకు మహేష్ సినిమాల కథలు అన్నీ కృష్ణ గారు ఎంపిక చేసినవే..! కృష్ణ గారి ఇన్ఫ్లుయెన్స్ వలనే మహేష్ బాబుకు పెద్ద బ్యానర్లలో సినిమాలు చేసే అవకాశం లభించింది. ఆ తర్వాత మహేష్ స్థాయి ఎలా పెరిగిందో తెలిసిందే. అయితే ఇప్పుడు మహేష్ అన్నయ్య రమేష్ బాబు, తండ్రి కృష్ణ ఇద్దరూ దూరమయ్యారు. మహేష్ కాకుండా ఆ ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు ఎవ్వరూ క్లిక్ అవ్వలేదు.
అతని తర్వాత గౌతమ్ బాబు కూడా క్లిక్ అవుతాడు అని అప్పుడే చెప్పలేము. సోషల్ మీడియాలో ఎక్కువగా సితార యాక్టివ్ గా కనిపిస్తుంది కానీ గౌతమ్ యాక్టివ్ గా కనిపించడం.ఎప్పుడూ అతను డల్ గానే కనిపిస్తాడు. ఇవన్నీ పక్కన పెట్టినా మహేష్ కు ఇప్పుడు పెద్ద దిక్కు లేరా? అనే ప్రశ్న ఎక్కువైంది. మహేష్ కు అండగా నిలబడేవారు కుటుంబంలో ఎవ్వరు ఉన్నారు? అనే దాని పై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. సినీ పరిశ్రమలో అయితే మహేష్ కు పెద్ద దిక్కు లేదు.
అతని బాబాయ్ లు ఆది శేషగిరిరావు, హనుమంతరావు లు.. నిర్మాతలే అయినప్పటికీ వాళ్ళు ఫేడౌట్ అయ్యి చాలా కాలం అయ్యింది. అయితే పొలిటికల్ గా కాస్తో కూస్తో సాయం అందించే వ్యక్తిగా మనం గల్లా జయదేవ్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా కృష్ణ గారు ఉన్నన్ని రోజులు పండుగలకు, పుట్టిన రోజులు కుటుంబాన్ని అంతటినీ ఒక చోటికి చేర్చి సెలబ్రేషన్స్ చేసేవారు. దాని వల్ల ఒకరి యోగక్షేమాలు ఇంకొకరు తెలుసుకుని.. ఒకరికొకరు సాయపడతారు అనేది ఆయన అభిప్రాయం.
ఆ వేడుకలకు మహేష్ హాజరయ్యే సందర్భాలు కూడా తక్కువే. ఛాన్స్ ఉంటే విదేశాలకు వెళ్లిపోవడం పక్కన పెట్టి.. ఇలాంటి విషయాల్లో మహేష్ యాక్టివ్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఏదేమైనా మహేష్ కెరీర్ ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటి నుండి ఒక లెక్క. చూడాలి మరి ఎలా ఉండబోతుందో..!