Waltair Veerayya: ‘వీరయ్య’ పాట వెనుక ఏం జరిగిందంటే?
January 6, 2023 / 12:56 PM IST
|Follow Us
సినిమాల టైటిల్ సాంగ్ అంటే.. కేవలం పాట మాత్రమే కాదు, అదొక ఎమోషన్ అని చెప్పొచ్చు. సినిమాలో హీరో హీరోయిజాన్ని వివరిస్తూ ఈ పాట సాగుతుంది. అయితే అంతర్లీనంగా హీరో పాత్రధారి గురించి అన్యాపదేశంగా చెబుతుంటారు. గతంలో చాలా సినిమాల్లో ఇదే జరిగింది. అతను నిజజీవితంలో ఓ స్టార్ అని చెప్పేలా పాట లిరిక్స్ ఉంటాయి. దీంతో అభిమానులు ఆ పాటను తెగ ఇష్టపడతారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అలా ముచ్చటపడుతున్న పాట ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ ట్రాక్. ఈ పాట రచయిత చంద్రబోస్ ఇటీవల ఆ గీతం గురించి ఓ మీడియాతో మాట్లాడారు.
‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోని ‘భగ భగ… ’ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఆ గీతాన్నిదేవిశ్రీప్రసాద్ స్వరపరిచారు. అన్నట్లు ఈ పాట విషయంలో శాస్త్రపరమైన చర్చ కూడా వచ్చింది కూడా. ‘‘ఎన్నో అకృత్యాలు, అరాచకాలు చేస్తూ అమాయకపు ప్రజల ప్రాణాల్ని తీసే రాక్షసుడిని సంహరించే క్రమంలో కథానాయకుడు ప్రజల పాలిట దేవుడు అవుతాడు. రాక్షస సంహారం సందర్భంలో వచ్చే పాటే ఈ ‘భగ భగ’. ఈ పాటను చంద్రబోస్ మూడు రోజులపాటు రాశారట.
ఆ పాట లిరిక్స్ ఇదిగో…
భగ భగ భగ భగ భగ భగ భగ భగ మండే
మగ మగ మగ మగ మగ మగ మగాడురా వీడే
జగ జగ జగ జగ జగ చెడు జగాన్ని చెండాడే
ధగ ధగ ధగ ధగ ధగ ధగ జ్వలించు సూరీడే
అగాధ గాథల అనంతలోతుల సముద్ర సోదరుడే వీడే
వినాశకారుల శ్మశానమౌతాడే
తుఫాను అంచున తపస్సు చేసే వశిష్ఠుడంటే అది వీడే
తలల్ని తీసే విశిష్డుడే వీడే… // వీరయ్యా… //