ఓ పెద్ద స్టార్ హీరోని కానీ.. అధికారంలో ఉన్న పొలిటీషియన్ ను కానీ విమర్శిస్తే.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాత్రమే జరుగుతుంది. కానీ అప్పటి రోజుల్లో వాళ్ళ అభిమానులు … విమర్శ చేసిన వారి పై దండయాత్ర చేసేవారు. వాళ్ళ పై చెప్పులు విసరడం, కోడిగుడ్లు, టమాటాలతో కొట్టడం జరిగేది. ఇంకా చెప్పాలంటే కొంత మంది ఆ విమర్శ చేసిన వాళ్ళ ప్రాణాలు తియ్యడానికి కూడా వెనుకాడే వారే కాదు. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే.. గతంలో పెద్ద ఎన్టీఆర్ పై ఓ సెటైరికల్ మూవీ వచ్చింది. ఆ చిత్రంలో ఎన్టీఆర్ స్టైల్ లో పాత్రను చాలా నెగిటివ్ గా చూపించారు.
ఆ సినిమా మరేదో కాదు ‘గండిపేట రహస్యం’. టి.ప్రభాకర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డివిఎస్ రాజు నిర్మించారు. సీనియర్ నరేష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో జయలలిత కూడా ఓ కీలక పాత్ర పోషించారు. ఇక ఎన్టీఆర్ పై సెటైరికల్ గా ఉండే పాత్ర పోషించింది ఎవరో తెలుసా.. మన 30 ఇయర్స్ పృథ్వి.ఆ చిత్రంలో అచ్చం ఎన్టీఆర్ లా దిగిపోయాడు. ఆ పాత్ర కోసం పృథ్వి ట్రైనింగ్ కూడా తీసుకున్నాడట. అయితే ఆ చిత్రం డిజాస్టర్ అయ్యింది. కొన్ని వివాదాలు జరగడం వల్ల ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ.. తరువాత 50 శాతం కూడా రికవరీ జరగలేదు.
అక్కడితో ఆగిపోతే పర్వాలేదు..కానీ ’30 ఇయర్స్ పృథ్వి పై ఎన్టీఆర్ అభిమానులు దాడి చెయ్యడానికి రెడీ అయిపోరాట’. అంతేకాదు అతన్ని మరో సినిమాలో తీసుకుంటే ఆ సినిమాలని బ్యాన్ చేస్తాం అనేంతలా నిరసన చేశారట పెద్ద ఎన్టీఆర్ అభిమానులు.అందువల్లే పృథ్వీ కి అప్పుడు అవకాశాలు రాలేదని స్పష్టమవుతుంది.కానీ తరువాత ఆ విషయాన్ని మెల్లగా వాళ్ళు మరిచిపోయారు.ఇప్పుడు పృథ్వీ ఇప్పుడు స్టార్ కమెడియన్ లలో ఒకడుగా రాణిస్తున్నాడని తెలుస్తుంది.
Most Recommended Video
కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!