Gaami: ‘గామి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
March 8, 2024 / 07:24 PM IST
|Follow Us
విశ్వక్ సేన్ (Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ (Gaami) ‘గామి’. విద్యాధర్ కాగిత (Vidyadhar Kagita) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి (Chandini Chowdary) హీరోయిన్ గా నటించింది. ‘తమడా మీడియా’ ‘వి సెల్యులాయిడ్’ సమర్పణలో ‘కార్తీక్ కల్ట్ క్రియేషన్స్’ బ్యానర్ పై (Karthik Sabareesh) కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన గ్లింప్స్ ను, మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.
మార్చి 8న శివరాత్రి కానుకగా ‘గామి’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రైలర్ ఈ సినిమా పై అంచనాలు పెంచేసింది. అందువల్ల ఈ సినిమాకి బిజినెస్ చాలా బాగా జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం
3.30 cr
సీడెడ్
1.15 cr
ఆంధ్ర(టోటల్)
3.20 cr
ఏపీ + తెలంగాణ(టోటల్)
7.65 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
1.50 cr
వరల్డ్ వైడ్(టోటల్)
9.15 cr
‘గామి’ చిత్రానికి రూ.9.15 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.9.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమాకి పాజిటివ్ టాక్ కనుక వస్తే.. టార్గెట్ అందుకోవడం కష్టమేమి కాదు. ‘విశ్వక్ సేన్’ గత సినిమా ‘దాస్ క ధమ్కీ’ (Das Ka Dhamki) బాక్సాఫీస్ వద్ద రూ.10 కోట్ల పైనే షేర్ ని కలెక్ట్ చేసింది.