Gaami Collections: బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచిన ‘గామి’
May 26, 2024 / 10:29 PM IST
|Follow Us
విశ్వక్ సేన్ (Vishwak Sen) ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘గామి'(Gaami). విద్యాధర్ కాగిత(Vidyadhar Kagita) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి (Chandini Chowdary)హీరోయిన్. ‘తమడా మీడియా’ ‘వి సెల్యులాయిడ్’ సమర్పణలో ‘కార్తీక్ కల్ట్ క్రియేషన్స్’ బ్యానర్ పై కార్తీక్ శబరీష్ (Karthik Sabareesh) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన గ్లింప్స్, మేకింగ్ వీడియో వంటివి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.
మార్చి 8న శివరాత్రి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది.దీంతో కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
‘గామి’ చిత్రానికి రూ.9.15 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.9.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.11.53 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఈ సినిమా రూ.2.03 కోట్ల లాభాలను అందించి క్లీన్ హిట్ గా నిలిచింది.