సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యసమస్యతో మృతి చెందిన ప్రముఖ నటుడు!
August 16, 2023 / 11:35 AM IST
|Follow Us
ఇటీవల సినీ ఇండస్ట్రీలు వరుస విషాదాలు అభిమానులను తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి. నటీనటులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూస్తున్నారు. కొంతమంది అనారోగ్య సమస్యలతో, రోడ్డు ప్రమాదాల్లో.. మరికొంతమంది బలవన్మరణాలకు పాల్పపడుతూ చనిపోతున్నారు. ఈ మద్యనే అమెరికన్ స్టార్ కమెడియన్ పాల్ రెబెన్స్ కన్నుమూశారు.. ఈ ఘటన మరువక ముందే మరో స్టార్ నటుడు కన్నుమూశారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు డారెన్ కెంట్ (39) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం (ఆగస్టు 11న) ఉదయం తుదిశ్వాస విడిచారు.
ఈ విషాద వార్తను ఆయన సన్నిహితులు ఆలస్యంగా మీడియాకు వెల్లడించారు. కాగా డారెన్ కెంట్ ఇంగ్లాండ్‌లోని ఎస్సెక్స్‌లో జన్మించారు. 2007లో ఇటాలియా కాంటిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన ఆ మరుసటి ఏడాది (2008) మిర్రర్స్ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. ద లిటిల్ స్ట్రేంజర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఈ సిరీస్ ఇతడికి విశేషమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. దీనితోపాటు అనేక హెచ్ బి ఓ డ్రామా సిరీస్‌లలోనూ నటించారు.
సన్నీబాయ్ సినిమాకు గాను కెంట్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. (Darren Kent) డారెన్ కెంట్ నటించిన చిత్రాలు స్నో వైట్ మరియు హంట్స్మాన్, చెరసాల & డ్రాగన్లు: దొంగల మధ్య గౌరవం, గేమ్ ఆఫ్ థ్రోన్స్, జీపర్స్ లతలు: పునర్జన్మ, సంఘటన, ది లిటిల్ స్ట్రేంజర్, ది లిటిల్ స్ట్రేంజర్, సంఘం, అద్దాలు వంటి సినిమాలు చేశాడు. కెంట్ ఆసక్తిగల రచయిత మరియు అనేక చలనచిత్రాలు మరియు లఘు చిత్రాలను వ్రాసాడు. డారెన్ కెంటన్ 2013లో ‘అబ్యుసింగ్ ప్రోటోకాల్’ పేరుతో వీటిలో ఒకదానిని వ్రాసి, దర్శకత్వం వహించాడు మరియు నటించాడు.