Gandeevadhari Arjuna Collections: ‘గాండీవధారి అర్జున’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • November 20, 2023 / 11:23 AM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ‘ఏజెంట్’ ఫేమ్ సాక్షి వైద్య హీరోయిన్ గా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ‘గాండీవధారి అర్జున’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ – బాపినీడు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్ , ట్రైలర్స్ లో యాక్షన్ ఎలిమెంట్స్ అలరించాయి. ఆగస్టు 25 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

మొదటి నుండి ఈ సినిమా పై ఎటువంటి పెద్దగా అంచనాలు లేవు. ఇక మొదటి రోజు మొదటి షో కే నెగిటివ్ టాక్ కూడా రావడంతో కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రాలేదు.మొదటి రోజు సో సోగా ఉన్నా.. రెండో రోజు నుండి ఈ సినిమా కలెక్షన్స్ చాలా వరకు పడిపోయాయి. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.42 cr
సీడెడ్ 0.15 cr
ఉత్తరాంధ్ర 0.20 cr
ఈస్ట్ 0.10 cr
వెస్ట్ 0.09 cr
గుంటూరు 0.10 cr
కృష్ణా 0.16 cr
నెల్లూరు 0.06 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.28 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.25 cr
ఓవర్సీస్ 0.28 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 1.81 cr (షేర్)

‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna) చిత్రానికి రూ.15.8 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.16 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం రూ.1.81 కోట్లు షేర్ ను రాబట్టింది. మొత్తంగా రూ.14.19 కోట్ల నష్టాలతో ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus