Gandeevadhari Arjuna Collections: ‘గాండీవదారి అర్జున’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • August 28, 2023 / 05:10 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ‘ఏజెంట్’ ఫేమ్ సాక్షి వైద్య హీరోయిన్ గా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ‘గాండీవధారి అర్జున’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ – బాపినీడు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్ , ట్రైలర్స్ లో యాక్షన్ ఎలిమెంట్స్ అలరించాయి. ఆగస్టు 25 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

మొదటి నుండి ఈ సినిమా పై ఎటువంటి పెద్దగా అంచనాలు లేవు. ఇక మొదటి రోజు మొదటి షో కే నెగిటివ్ టాక్ కూడా రావడంతో కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రాలేదు అనే చెప్పాలి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.24 cr
సీడెడ్ 0.07 cr
ఉత్తరాంధ్ర 0.09 cr
ఈస్ట్ 0.07 cr
వెస్ట్ 0.06 cr
గుంటూరు 0.04 cr
కృష్ణా 0.08 cr
నెల్లూరు 0.03 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.68 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.10 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.90 cr (షేర్)

‘గాండీవదారి అర్జున’ (Gandeevadhari Arjuna) చిత్రానికి రూ.15.8 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.16 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ చిత్రం కేవలం రూ.0.90 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.15.10 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus