తన టీంతో కలిసి విమాన ప్రయాణం చేసిన యూట్యూబర్ గంగవ్వ.. ఫోటోలు వైరల్!

  • February 20, 2023 / 08:53 AM IST

యూట్యూబర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న గంగవ్వ గురించి అందరికీ సుపరిచితమే 62 సంవత్సరాల వయసు కలిగిన గంగవ్వ అభివృద్ధి చెందిన ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని మై విలేజ్ షో అనే ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి యూట్యూబ్ ఛానల్ ద్వారా తన పల్లెటూరి జీవన విధానం గురించి ఎన్నో వీడియోలను చేస్తూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరితో పంచుకునేవారు.

ఇలా అతి తక్కువ సమయంలోనే గంగవ్వ వీడియోలకు ఎంతో మంచి ఆదరణ రావడంతో ఒక్కసారిగా గంగవ్వ ఎంతో ఫేమస్ అయ్యారు. ఇలా ఈమెకు వచ్చిన పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని ఈమెకు బిగ్ బాస్ అవకాశం కూడా వచ్చింది.ఇలా బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గా వెళ్లినటువంటి ఈమె అనారోగ్య కారణాలవల్ల మధ్యలోనే బయటకు వచ్చింది. అయితే తనకు సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం కోసమే బిగ్ బాస్ వెళ్లినట్టు గంగవ్వ చెప్పారు.

ఇలా గంగవ్వ సొంత ఇంటి కోరికను నెరవేర్చడం కోసం నాగార్జున సైతం ఎంతో సహాయం చేసి గంగవ్వ కలను నెరవేర్చారు.ఇలా బిగ్ బాస్ తర్వాత సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ బిజీగా ఉన్నటువంటి గంగవ్వ నిత్యం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వీడియోలు చేస్తూ అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె మొదటిసారి తన టీం తో కలిసి విమాన ప్రయాణం చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈమె విమాన ప్రయాణానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎక్కడికి వెళుతున్నానో కనుక్కోవాలి అంటూ హింట్ కూడా ఇచ్చారు. అయితే గంగవ్వ తన టీమ్ మెంబర్స్ తో కలిసి ఈషా ఫౌండేషన్ వారు శ్రీ సద్గురు సమక్షంలో నిర్వహించే శివరాత్రి వేడుకలలో పాల్గొనడం కోసం వెళ్ళినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు కాస్త వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు గంగవ్వ కు హ్యాపీ జర్నీ అంటూ ఈ ఫోటోలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus