Gangavva: గంగవ్వ ఇంటి కోసం అంత అప్పు చేశారా?

  • November 10, 2021 / 11:48 AM IST

మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న గంగవ్వ బిగ్ బాస్ షో ద్వారా క్రేజ్, పాపులారిటీని ఊహించని స్థాయిలో పెంచుకున్నారు. గంగవ్వ కోసమే బిగ్ బాస్ షో సీజన్ 4ను చూసిన అభిమానులు ఎంతోమంది ఉన్నారు. రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో గంగవ్వను అభిమానిస్తూ ఎన్నో ఆర్మీలు క్రియేట్ అయ్యాయి. సొంతింటి కలను నిజం చేసుకోవాలనే కోరికతో గంగవ్వ బిగ్ బాస్ హౌస్ కు వచ్చారు.

నాగార్జున గంగవ్వ ఇంటికి సహాయం చేస్తానని మాట ఇవ్వడంతో పాటు ఆ మాటను నిలబెట్టుకున్నారు. జగిత్యాల జిల్లాలోని లాంబాడిపల్లి గ్రామంలో కొత్తగా కట్టుకున్న ఇంట్లోకి తాజాగా గంగవ్వ గృహప్రవేశం చేశారు. గంగవ్వ గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ కావడం గమనార్హం. కామెడీ టైమింగ్ తో, పల్లెటూరి యాసలో మాట్లాడుతూ గంగవ్వ ప్రేక్షకులను చాలా ఆకట్టుకున్నారు. అయితే అనారోగ్య సమస్యలతో పాటు ఇతర సమస్యల వల్ల గంగవ్వ ఐదో వారంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లారు.

బిగ్ బాస్ షో ద్వారా గంగవ్వకు 11 లక్షల రూపాయలు రాగా నాగార్జున 7 లక్షల రూపాయల వరకు సహాయం చేశారు. గంగవ్వ మూడు లక్షల రూపాయలు అప్పు చేసి ఇల్లు కట్టుకున్నారు. గంగవ్వ కొత్తిల్లు కార్యక్రమానికి అఖిల్ సార్థక్, శివజ్యోతి, మై విలేజ్ టీం సభ్యులు హాజరయ్యారు. తన కలను నెరవేర్చుకున్న గంగవ్వకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. గంగవ్వ ఎంతో కష్టపడి సొంతింటి కలను నెరవేర్చుకున్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus