Gangavva Remuneration: సినిమాలు, యూట్యూబ్ ద్వారా భారీగా సంపాదిస్తున్న గంగవ్వ?

  • October 3, 2022 / 07:01 PM IST

మై విలేజ్ షో ద్వారా ఎక్కడో కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నటువంటి గంగవ్వ ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె పల్లె వాతావరణానికి సంబంధించిన అన్ని విషయాలను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన బంధువుల సహాయంతో వీడియోలు చేస్తూ భారీగా పాపులారిటీ సొంతం చేసుకున్నారు.ఇలా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న గంగవ్వ ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.

ఇకపోతే బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న గంగవ్వకు ఆర్థికంగా బాగా స్థిరపడటమే కాకుండా తన సొంత ఇంటి కలను కూడా నెరవేర్చుకున్నారు.ఇలా బిగ్ బాస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమెకు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అభిమానులుగా మారిపోయారు.ఈ క్రమంలోనే ఈమె క్రేజ్ దృష్టిలో పెట్టుకున్నటువంటి కొందరు దర్శక నిర్మాతలు తనకు పలు సినిమాలలో నటించే అవకాశాన్ని కూడా కల్పించారు.

ఈ క్రమంలోనే గంగవ్వ ఇదివరకే పలు సినిమాలలో సందడి చేసిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే సాధారణంగా చిన్నచిన్న సెలబ్రిటీలకు నిర్మాతలు ప్రత్యేకంగా కేరవాన్ సదుపాయం కల్పించరు.కానీ గంగవ్వకు మాత్రం ప్రత్యేకంగా కేరవాన్ ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె షేర్ చేసుకున్నారు.ఇలా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండే గంగవ్వ ఒక్కో సినిమాకు ఎంతవరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఈ క్రమంలోనే గంగవ్వ ఒకరోజు సినిమా షూటింగ్లో పాల్గొంటే సుమారు పదివేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమెకు భారీగానే ఆదాయం వస్తుందని తెలుస్తోంది. ఇలా యూట్యూబ్ ద్వారా ఈమె నెలకు ఏకంగా లక్ష రూపాయలకు పైగా సంపాదిస్తున్నారని సమాచారం. ఏది ఏమైనా గంగవ్వ ఈ వయసులో ఇలా నటిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని చెప్పాలి.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus