విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నేహా శెట్టి (Neha Shetty) హీరోయిన్ గా అంజలి (Anjali) కీలక పాత్రలో తెరకెక్కిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'(Gangs of Godavari). కృష్ణ చైతన్య (Krishna Chaitanya) ఈ చిత్రానికి దర్శకుడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్, పాటలు.. వంటివి బాగున్నాయి. పైగా విశ్వక్ సేన్ వరుస హిట్లతో ఫామ్లో ఉన్నాడు. అందువల్ల ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా పై మొదటి నుండి మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
అయితే మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసింది. అయితే 4వ రోజు కొంచెం ఎక్కువ డ్రాప్స్ కనిపించాయి.ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 2.66 cr |
సీడెడ్ | 1.39 cr |
ఉత్తరాంధ్ర | 0.81 cr |
ఈస్ట్ | 0.57 cr |
వెస్ట్ | 0.45 cr |
కృష్ణా | 0.41 cr |
గుంటూరు | 0.48 cr |
నెల్లూరు | 0.29 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 7.06 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.46 cr |
ఓవర్సీస్ | 0.99 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 8.51 cr (షేర్) |
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రానికి రూ.10.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.11.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.8.51 కోట్ల షేర్ ని రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో రూ.2.79 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.