Gangubai Collections: ‘ఆర్.ఆర్.ఆర్’ హీరోయిన్ సినిమా కూడా బాగానే కలెక్ట్ చేస్తుంది..!

  • February 28, 2022 / 08:37 PM IST

‘ఆర్.ఆర్.ఆర్’ హీరోయిన్ మరియు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన ఆలియా భట్ విభిన్న పాత్రలో నటించి మెప్పించిన ‘గంగూబాయ్ కతియావాడి’ చిత్రం ఫిబ్రవరి 25న హిందీతో పాటు అన్ని భాషల్లోనూ విడుదలై మంచి టాక్ ను సంపాదించుకుంది. తెలుగులో ‘భీమ్లా నాయక్’ తమిళ్ లో ‘వలీమై’ వంటి బడా సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ఈ మావీ అన్ని భాషల్లోనూ మంచి వసూళ్ళనే సాధించింది. సంజయ్ లీల భన్సాలీ సినిమాలకి ఉండే క్రేజ్ ఏంటన్నది ఈ మూవీ మరోసారి ప్రూవ్ చేసింది.

దేశ వ్యాప్తంగా మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.10.50 కోట్లు, రెండో రోజు రూ.13.32 కోట్లు, మూడవ రోజు రూ.15.30 కోట్లను వసూలు చేసి దూసుకుపోతుంది. మొత్తంగా ఫస్ట్ వీకెండ్ ఈ మూవీ రూ.39.12 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసింది. సంజయ్ లీలా భన్సాలీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎంత భారీగా కలెక్ట్ చేసినప్పటికీ.. విడుదలకు ముందు టీజర్, ట్రైలర్ లతో ఎన్నో వివాదాలు క్రియేట్ చేసి సంచలనాలు రేపుతుంటాడు.

ఈ మూవీ విషయంలో మరోసారి అదే సీన్ రిపీట్ అయ్యింది. గంగూబాయ్‌ కథియావాడీని వేశ్యగా చూపించారంటూ ఆమె తనయుడు బాబూ రావుజీ షా కోర్టుకెక్కాడు. సినిమా విడుదల కూడా ఆపేయాలని విశ్వ ప్రయత్నాలు చేసాడు. అయితే అతని పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. అనుకున్నట్టుగానే సినిమా విడుదలవ్వడం మంచి వసూళ్ళని సాధించడం జరిగిపోతుంది. ఈ భారీ వసూళ్ళకి ఆ కోర్టు కేసులు వంటివి కూడా బాగానే హెల్ప్ చేసాయి.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus