ఇంకో రాజకీయ నటవారసుడు!

  • July 12, 2016 / 02:14 PM IST

ఆంధ్రా మినిస్టర్ గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ త్వరలోనే కథానాయకుడిగా వెండితెర రంగప్రవేశం చేయనున్నాడు. ఒక మినిస్టర్ (గంటా శ్రీనివాసరావు) కి కొడుకు, మరిక మినిస్టర్ (నారాయణ)కి అల్లుడు అయిన గంటా రవితేజ గత కొద్ది కాలంగా కథానాయకుడిగా పరిచయమవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటూ వస్తున్నాడు.

వందల సంఖ్యలో కథలు, పదుల సంఖ్యల దర్శకులను పరిశీలించి ఎట్టకేలకు సీనియర్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో ఓ సినిమా సైన్ చేశాడు. “కాళహస్తి” అనే టైటిల్ ను ఫిక్స్ చేయబడిన ఈ చిత్రం త్వరలోనే లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమాలో కథానాయికగా ఓ ప్రముఖ హీరోయిన్ నటించనుందని వినికిడి. ప్రస్తుతం ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus