లీకైన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఫోటోలు

  • September 1, 2016 / 11:01 AM IST

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ షూటింగ్ ఫోటోలు లీకయ్యాయి.రెండవ శతాబ్దానికి చెందిన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా జాతీయ అవార్డు గ్రహీత క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో బాలకృష్ణ రాజుగా హుందాగా నడుస్తూ కనిపించాడు. సినిమాలో రాజమాత పాత్ర పోషిస్తున్న హేమమాలిని, భార్యగా నటిస్తున్న శ్రియలు కూడా రాజసం ఉట్టి పడే వస్త్ర ధారణలో కనిపించారు.

మొరాకో, హైదరాబాద్ పరిసరాల్లో యుద్ధ సన్నివేశాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడి చిత్రీకరణ సమయంలో తీసిన ఫొటోలివి. అధికారికంగా చిత్ర బృందం పోస్టర్ లను విడుదల చేయక పోయినా.. వీటిని చూసి బాలయ్య అభిమానులు ఆనందపడుతున్నారు. బాలకృష్ణ వందో సినిమా ఎంత భారీగా తెరకెక్కుతుందో ఈ చిత్రాలు చెబుతున్నాయని వెల్లడించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus