ఫ్యామిలీ కోసం స్పెషల్ స్క్రీనింగ్ !!!

  • January 11, 2017 / 07:10 AM IST

రేపే సరికొత్త చరిత్రకు శ్రీకారం, టాలీవుడ్ చరిత్రలో ప్రభంజనం సృష్టించబోతున్న గౌతామీ పుత్ర శాతకర్ణి విడుదల….అవును ఫక్తు కమర్షియల్ సినిమాలే ఆధారంగా చేసుకుని హిట్స్ కొడుతున్న బడా హీరోలు ఉన్న మన టాలీవుడ్ లో సాహసానికి మారుపేరుగా, లెజెండ్ గా, నట సింహం గా నందమూరి బాలయ్య ఉండడం మనం గర్వించ దగ్గ విషయం…అయితే అదే క్రమంలో మన శాతవాహనుల చరిత్రను మన కళ్ళకు కట్టేలా చూపించేందుకు రేపు బరిలో దిగుతున్నాడు మన బాలయ్య…ఇదిలా ఉంటే మరో పక్క నందమూరి  ఫ్యాన్స్ హంగామా, హడావిడి పీక్ స్టేజ్ కి చేరిపోయింది. తెలుగుజాతి ఖ్యాతిని  దశదిశలా చాటిన యుద్ధవీరుడిగా బాలకృష్ణ అభినయాన్ని ఆద్యంతం ఎంజాయ్ చేసేందుకు నందమూరి అభిమానులే కాకుండా తెలుగు  ప్రేక్షకులు సహితం సిద్ధమవుతున్నారు అని టాక్ బలంగా వినిపిస్తుంది…ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి వస్తున్న ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ తో  నందమూరి అభిమానులు ఇంకా సినిమా విడుదల కాకుండానే పండుగ చేసుకుంటున్నారు.

అయితే థియేటర్స్ లోకి ఈనెల 12న రానున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ని తన కుటుంబ సభ్యుల కోసం  బాలకృష్ణ ప్రత్యేకంగా స్క్రీనింగ్ ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే…తెలుస్తున్న సమాచారం మేరకు గత రాత్రి రామానాయుడు స్టూడియోస్ లో ‘శాతకర్ణి’ ని ప్రత్యేకంగా ప్రదర్శించారు అని తెలుస్తోంది.  బాలకృష్ణతో పాటు ఆయన భార్య వసుంధర నారా లోకేష్  బ్రాహ్మణిలతో పాటు బాలకృష్ణ సన్నిహిత కుటుంబ సభ్యులు స్నేహితులు ఈ స్పెషల్ షోకి వచ్చినట్లు టాక్.   మొత్తం మూవీ అంతా పూర్తయ్యే సరికి ఆధియేటర్  అంతా కరతాళధ్వనులతో నిండిపోయిందని అంటున్నారు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల్లో బాలయ్య నటనకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు వశిష్టీ దేవిగా శ్రియ నటనకు అందరూ ఆశ్చర్య పోయారని వార్తలు వస్తున్నాయి.  మరి అదే ఆనందాన్ని, అనుభూతిని నందమూరి అభిమానులు ఆస్వాదిస్తారో లేదో…మరో 24గంటల్లో తేలిపోతుంది…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus