విలన్ గా మరో దర్శకుడు!

  • September 12, 2016 / 08:12 AM IST

దర్శకుడన్నాక సినిమాకి సంబంధించి అన్ని విభాగాల్లోనూ ప్రవేశం ఉండాలి. ఒకవేళ లేకపోయినా అనుభవంతో నైపుణ్యం అంతా రాకపోయినా అంతో ఇంతో అబ్బి తీరుతుంది. సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో కొన్నిసార్లు దర్శకుడులోని నటడు బయటికొస్తుంటాడు. ఇలా కొందరు దర్శకులు అతిథి పాత్రల్లో మెరుస్తుంటే, మరికొందరు పూర్తిస్థాయి నటులుగా మెప్పిస్తున్నారు. ఇది అన్ని వుడ్ లోను ఉన్నదే. పూర్తిస్థాయి నటులుగా మారిన తమిళ దర్శకులలో సముద్రఖని, ఎస్ జె సూర్య, భారతీరాజా వంటివారుండగా తాజాగా ఈ జాబితాలోకి మరో పేరు చేరింది.

తమిళ, తెలుగు భాషల్లో దర్శకుడిగా మంచి గుర్తింపున్న గౌతమ్ మీనన్ త్వరలో ఓ సినిమాలో విలన్ గా కనపడనున్నారు. అదీ నయనతార నటిస్తున్న సినిమాలో. డీమోంటి కాలనీ సినిమాతో తొలి ప్రయత్నంలోనే విజయం అందుకున్న అజయ్ జ్ఞానముత్తు తన రెండో సినిమా కోసం పావులు కదుపుతున్నాడు. నయన్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాలో విలన్ పాత్రకు గౌతమ్ మీనన్ సరిపోతారని భావించిన అజయ్ ఈ మేరకు గౌతమ్ ని సంప్రదించారట. ధనుష్ తో సినిమా చేస్తున్నందున తొలుత కష్టం అని చెప్పిన గౌతమ్ మీనన్ కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారుట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus