Mohan Babu: వచ్చే ఎన్నికలలో కూడా జగనే ముఖ్యమంత్రి!

  • July 4, 2022 / 11:31 AM IST

ఈ మధ్యకాలంలో డైరెక్టర్ గీత కృష్ణ ఎక్కువగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ప్రస్తుత సెలబ్రిటీల గురించి పెద్ద ఎత్తున షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈయన సినిమాల కన్నా ఈ విధంగా ఇంటర్వ్యూల ద్వారా సెలబ్రెటీల గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన గీతాకృష్ణ తాజాగా మోహన్ బాబు గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా మోహన్ బాబు వైసీపీ పార్టీ నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారనే విషయం తెలియగానే ఈయన ఈ విషయంపై స్పందిస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

మోహన్ బాబు కుటుంబానికి జగన్ కుటుంబానికి మధ్య సన్నిహితమే కాకుండా ఇద్దరికీ బంధుత్వం కూడా ఉంది. జగన్ సోదరి వేరోనికాను మంచు విష్ణు వివాహం చేసుకోవడంతో వీరిద్దరూ బంధువులయ్యారు. ఇలా బంధుత్వం కారణంగానే టీడీపీ పార్టీలో ఉన్నటువంటి మోహన్ బాబు వైసీపీలోకి వచ్చారు. ఇక అప్పటి నుంచి తరచూ జగన్ ని కలవడం వారితో సన్నిహితంగా ఉండటం జరుగుతుంది. ఇక సినిమా ఇండస్ట్రీలో టికెట్ల రేట్ల గురించి పెద్ద ఇష్యూ జరిగినప్పుడు మంచు విష్ణు ప్రత్యేకంగా జగన్ ని కలిసి చర్చించారు.

ఇక మోహన్ బాబు ఆ పార్టీలోకి చేరితే తనని జగన్ స్పెషల్ గా చూడాలని అనుకున్నారు. అయితే అలాంటిదేమీ కుదరకపోవడంతో ప్రస్తుతం ఈయన వైసీపీ పార్టీని వదిలి బీజేపీ పార్టీలోకి వెళ్తున్నారు. మోహన్ బాబు బీజేపీ పార్టీలోకి వెళ్ళినంత మాత్రాన వైసీపీ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని గీతాకృష్ణ వెల్లడించారు. జగన్ ఒక వ్యూహకర్త అతను ఎవరిని అందలం ఎక్కించి తిప్పరు. అందుకే మోహన్ బాబు ఇలా మరొక పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు.

ఈయన పార్టీలో ఎవరు ఉన్నా లేకపోయినా వచ్చే ఎన్నికలలో గెలిచేది మాత్రం జగన్ మోహన్ రెడ్డి. జగన్ భజన చేసే వాళ్ళు పార్టీలో లేకపోయినా ప్రజలు ఆయనకు ఓట్లు వేసి గెలిపిస్తారు. తప్పకుండా 2024 ఎన్నికలలో కూడా జగన్ ముఖ్యమంత్రి అవుతారు అంటూ గీత కృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus