ప్రతి వారం సరికొత్త ఎపిసోడ్ తో అలరిస్తున్న గీతాసుబ్రహ్మణ్యం అందరికీ పక్కింటి జంటగా మారిపోయారు. వారి సరదా పందేలు, మాటల యుద్ధాలను చూసేందుకు ఎదురుచూసేవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. వైరల్లీ సౌత్ వారు అందిస్తున్న గీతాసుబ్రహ్మణ్యం వెబ్ సిరీస్ నుంచి ఈ వారం అద్భుతమైన ఎపిసోడ్ వచ్చేసింది. "ది గెస్ట్" పేరుతో వచ్చిన ఈ ఎపిసోడ్ లో అతిథి వల్ల గీతాసుబ్రహ్మణ్యంలు పడిన తిప్పలు కంటే.. ఈ జంట వల్ల గెస్ట్ పడే ఇబ్బందే మనకి హాస్యాన్ని పంచుతుంది.
పైగా ఇందులో అమ్మాయిల గురించి సుబ్బు చెప్పే మాటలు అర్ధవంతంగా, ఆలోచింపజేసేదిగా ఉన్నాయి. నేటి యువత "గెస్ట్" కి బాగా కనెక్ట్ అవుతారు.