Geethu Royal: ఆదిరెడ్డి కారణంగానే అలాంటి ప్రశ్నలు వేసేవారా?

  • December 29, 2023 / 05:14 PM IST

బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన తర్వాత తదుపరి ఆ కంటెస్టెంట్ కు బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో పాల్గొంటారు అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమానికి ముందు సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు మాత్రమే యాంకర్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సీజన్ సెవెన్ బజ్ కార్యక్రమానికి సీజన్ సిక్స్ కంటెస్టెంట్ గలాట గీతూ యాంకర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె కంటెస్టెంట్లను గట్టి ప్రశ్నలే అడుగుతూ వారి నుంచి సమాధానాలు రాబట్టే వారు. ఇలా ఈమె అడిగే ప్రశ్నలు హౌస్ లో నాగార్జున కూడా అడగలేదు అంటూ ఇటీవలే ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే తాజాగా బజ్ కార్యక్రమంలో ఈమె అడిగే ప్రశ్నల గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.

ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్లను అడిగే ప్రశ్నలన్ని కూడా యాంకర్లే షో మొత్తం చూసి ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే సీజన్ సెవెన్ కి కూడా గీతూనే ప్రశ్నలు అన్నింటిని ప్రిపేర్ చేసుకుంది అని అందరం భావించారు. కానీ ఈమె ప్రశ్నలను గీతూ ప్రిపేర్ చేయలేదని తనకు ఆదిరెడ్డి (Geethu Royal) ఈ ప్రశ్నలు అన్నింటిని కూడా ప్రిపేర్ చేసి ఇచ్చారు అంటూ ఇటీవల ఈమె తెలిపారు.

ఈ షో టైం లోనే మా అమ్మ అనారోగ్యానికి గురికావడంతో షో నేను ఫాలో అవ్వలేకపోయాను అందుకే ఆదిరెడ్డికి చెప్పడంతో తానే స్వయంగా ఈ ప్రశ్నలన్నింటినీ ప్రిపేర్ చేసి ఇచ్చారు అంటూ గీతూ వెల్లడించారు. ఆదిరెడ్డి రివ్యూ కోసం షో మొత్తం చూస్తుంటారు. అందుకే ఆయనకు పెద్దగా ఇబ్బంది కలగలేదని ఈమె తెలిపారుగా. ఆదిరెడ్డి బిగ్ బాస్ రివ్యూయర్ మాత్రమే కాకుండా బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గా కూడా సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus