Geetu: ఆ కోరిక తీరకుండానే హౌస్ లో నుండీ బయటకి వచ్చేసిందట..!
November 24, 2022 / 06:38 PM IST
|Follow Us
గీతు రాయల్.. పలు మోటివేషనల్ వీడియోలు చేసి బాగా పాపులర్ ఆయిన ఈమె ఆ తర్వాత బిగ్ బాస్ రివ్యూ లు చేస్తూ ఆ షో పై ఆశలు పెంచుకుంది. ఎప్పటికైనా ఈ షోకి వెళ్ళాలి అని కలలు కన్నది. మొత్తానికి ఈమె కోరుకున్నట్టే… బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది. సీజన్ 6లో ఈమెకు అవకాశం దక్కింది. సక్సెస్ ఫుల్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కచ్చితంగా టైటిల్ గెలవాలి అనే ఉద్దేశంతో ఈమె గేమ్ ఆడింది.
కానీ ఆమెది ఓవర్ కాన్ఫిడెన్స్ అని, హౌస్ లో ఓవర్ యాక్షన్ చేస్తుంది అని ప్రేక్షకులు ఫీల్ అయ్యారు. చాలా కాలం ఓపిక పట్టినా..ఈమె తన తప్పుని సరిచేసుకోకపోవడంతో ప్రేక్షకులు ఈమెకు ఓట్లు వేయలేదు అని స్పష్టమవుతుంది. ఈ మధ్యనే హౌస్ లో నుండీ బయటకి వచ్చేసి గీతు… ఆ విషయాన్ని ఈజీగా తీసుకోవడం లేదు. బిగ్ బాస్ ఎపిసోడ్ లు చూస్తూ…హౌస్ లో ఉన్న రోజులను తలుచుకుని… తలుచుకుని ఎడ్చేస్తుంది.
ముఖ్యంగా ఫ్యామిలీ ఎపిసోడ్ వరకు ఉండాలని.. తన తల్లిని కూడా బిగ్ బాస్ ద్వారా ప్రపంచానికి చూపించాలని.. ఆమె చాలా ఆశపడింది. ఇందుకోసం ఆమె తన తల్లికి ఓ చీర కొనిపెట్టి .. ఈ ఎపిసోడ్ కు తన తల్లిని ఈ చీర కట్టుకుని రావాలని కోరిందట.ఈ విషయాలు ఆమె భర్త చెప్పుకొచ్చాడు. కానీ ఆ టాస్క్ వచ్చే వరకు ఈమె హౌస్ లో ఉండలేకపోయింది గీతు. ఈమె సడన్ ఎలిమినేషన్ తో షాక్ తిన్నట్టు గీతు భర్త తెలియజేస్తూ ఆమె ఏడుస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది.