Geetu Eliminated: ఎలిమినేషన్ లో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఇదే..!
November 5, 2022 / 03:20 PM IST
|Follow Us
బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం అనూహ్యంగా గీతు రాయల్ ఎలిమినేట్ అయినట్లుగా సమాచారం. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అవుతోంది. నిజానికి ఈవారం 10మంది నామినేషన్స్ లో ఉన్నారు. వాళ్లలో గీతు రాయల్ ఫస్ట్ నుంచీ ఈవారం డేంజర్ జోన్ లోనే ఉంది. రేవంత్, బాలాదిత్య, ఇనయ ఇంకా కీర్తి వీళ్లు నలుగురు సేఫ్ జోన్ లో ఉన్నారు. గీతు, మెరీనా, రోహిత్, ఆదిరెడ్డి, ఫైమా ఇంకా శ్రీసత్య ఈ ఆరుగురు డేంజర్ జోన్ లో ఉన్నారు
. వీళ్లలో లాస్ట్ వరకూ గీతు ఇంకా శ్రీసత్య ఇద్దరిలో గీతు ఎలిమినేట్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. అయితే, గీతు ని సీక్రెట్ రూమ్ లో ఉంచారా ? లేదా అనేది తెలియాలి. ఇక గీతు రాయల్ లాస్ట్ వీక్ చేపల టాస్క్ నుంచీ అన్ని టాస్క్ ల్లో పూర్ గా పెర్ఫామెన్స్ ఇస్తునే వచ్చింది. గతవారం నాగార్జున ఫుల్ క్లాస్ కూడా పీకారు. దీంతో గీతు తన ఆటతీరుని మార్చుకుంటుందని అనుకున్నారు. కానీ, మళ్లీ ఈవారం కూడా మిషన్ ఇంపాజబుల్ టాస్క్ లో కూడా లూప్స్ పట్టుకుని రెడ్ టీమ్ లో గందరగోళం సృష్టించింది.
నామినేషన్స్ లో ఉన్నవాళ్లలో ఈసారి ఇనయ వెళ్లిపోతుందని గీతు బెట్ కూడా కట్టింది. శ్రీసత్య అయితే ఇనయ వెళ్లదని చెప్పింది. వీళ్లిద్దరూ కోడిగుడ్లు పందెం కూడా కట్టుకున్నారు. కానీ, అనూహ్యంగా గీతు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఆదిరెడ్డితో కలిసి లూప్ పట్టుకుని గేమ్ ఆడటం, అందర్నీ ఆటలో రెచ్చగొట్టడం అనేది గీతు గేమ్ ని దెబ్బకొట్టింది. గతవారం నామినేషన్స్ లో హౌస్ మొత్తం ఉన్నప్పుడు గీతు మూడో స్థానంలో ఓటింగ్ లో కొనసాగింది. అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో చూస్తే రేవంత్ ఫస్ట్ పొజీషన్, శ్రీహాన్ రెండో ప్లేస్ లో, గీతు మూడోప్లేస్ లో కొనసాగింది.
కానీ, ఈవారం ఓటింగ్ లో వెనకబడిపోయింది. ఈవారం నామినేషన్స్ లో 10మంది ఉన్నా కూడా గీతు రాయల్ కి సరైన ఓట్లు పడలేదు. అన్ అఫీషియల్ పోలింగ్ లో కూడా వెనకబడిపోయింది. శ్రీసత్య, ఆదిరెడ్డి, ఫైమా, గీతు ఈ నలుగురికి ఈవారం ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గిపోయింది. అందుకే ఎలిమినేట్ అయిపోవాల్సి వచ్చింది. ఇక గీతు రాయల్ ఎలిమినేషన్ అనేది హౌస్ మేట్స్ తో పాటుగా, ఆడియన్స్ కి కూడా షాక్ ఇచ్చిందనే చెప్పాలి.
ఫస్ట్ వీక్ నుంచీ గీతురాయల్ గేమ్ చాలా డిఫరెంట్ గా ఆడింది. బిగ్ బాస్ కే ఒక్కోసారి షాక్ ఇచ్చింది. మొత్తానికి యూట్యూబర్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన గీతు 9వారాల పాటు గేమ్ లో ఉందంటే గ్రేట్ అనే చెప్పాలి. బయట చాలామందిలో నెగిటివిటీ వచ్చినా కూడా తనదైన మార్క్ ఈ సీజన్ లో చూపించందనే చెప్పాలి. మొత్తానికి గీతు రాయల్ జెర్నీ ఇలా ముగిసింది.