Geetu Royal: చేతిలో కాదు ఎక్కడైనా పెట్టుకుంటా.. దమ్ముంటే ఆడండి..!
September 10, 2022 / 11:18 AM IST
|Follow Us
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ పూర్తి అయ్యింది. ఈ టాస్క్ ఆడేటపుడు సంచాలక్ ఫైమా హౌస్ మేట్స్ ని, కెప్టెన్సీ పోటీదారులుగా గేమ్ ఆడినవాళ్లని చాలా బాగా కంట్రోల్ చేసింది. అంతేకాదు, గీతు స్ట్రాటజీలు ప్లే చేస్తుంటే వాటిని తిప్పికొట్టింది. ఇక్కడే గీతు కొద్దిగా ఓవర్ గా మాట్లాడింది. థర్మాకోల్ బాల్స్ లో లెటర్స్ వెతికేటపుడు అన్ని లెటర్స్ ని చేతిలో పట్టుకుని వేరేవాళ్లకి దొరక్కుండా చేసింది. ఇది చూసిన మెరీనా అబ్జక్ట్ చేసింది.
నేను చెతిలో కాదు ఇంకా నా టీషర్ట్ లో కూడా పెట్టుకుంటా, మీరు గుంజుకోవాలి, లాక్కోవాలి అదే కదా గేమ్ అంటూ రెచ్చిపోయి మాట్లాడింది గీతురాయల్. దీంతో హౌస్ మేట్స్ అందరూ గేమ్ అయ్యాక గీతుకి క్లాస్ పీకారు. ఆడవాళ్లు అలా టీషర్ట్స్ లో , ప్యాంట్ లో దాచుకుంటే మగవాళ్లు గేమ్ ఎలా ఆడతారు అని ప్రశ్నించారు. దీంతో గీతు కాసేపు పాయింట్ లెస్ గా ఆర్గ్యూమెంట్ చేసింది. గీతు మాట్లాడిన మాటలన్ని ఇచ్చిన స్టేట్మెంట్ ని మెరీనా, శ్రీసత్, కీర్తి కలిసి వ్యతిరేకించారు.
దీంతో గీతు నోటికి తాళం పడింది. నిజానికి గీతు ఆడిన అన్ ఫెయిర్ గేమ్ ని తన తోటి పార్టిసిపెంట్ మద్దతు తెలిపిన ఆరోహిరావ్ బయటపెట్టింది. గీతు ఫస్ట్ బాక్స్ తెరిచి కీస్ ని తీస్కుని వచ్చి వేరే వాళ్ల టబ్ లో వేసిందని, ఇదేంటని అడిగితే లైట్ అని చెప్పిందని ఆరోహి మాట్లాడింది. దీంతో హౌస్ మేట్స్ అందరూ గీతు గేమ్ ని జెన్యూన్ కాదని చెప్పారు.
నేను అన్ ఫెయిర్ గా ఆడతా, స్ట్రాటజీలు వాడతా, గెలవడమే నాకు ముఖ్యం అంటూ రెచ్చిపోయి మరీ వాదించింది గీతు. దీంతో హౌస్ మేట్స్ కి గీతురాయల్ ఇప్పుడు కొరకరాని కొయ్యలాగా మారింది. వీకండ్ వరెస్ట్ పెర్ఫామర్ ని ఎంచుకోమని బిగ్ బాస్ చెప్పగానే, చాలామంది గీతుని మరో ఆలోచన లేకుండా ఓటు వేసి మరీ జైలుకి పంపారు. మరి వీకండ్ నాగార్జున ఈ టాస్క్ గురించి ఏం మాట్లాడతారు అని బిగ్ బాస్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదీ మేటర్.