Genelia: దురదృష్టం అంటూ జెనీలియా ప్రెగ్నెన్సీ రూమర్లపై రియాక్ట్ అయిన రితేష్!

  • September 12, 2023 / 11:18 AM IST

ప్రముఖ సినీ నటి జెనీలియా తల్లి కాబోతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి మనకు తెలిసిందే. నటి జెనీలియా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూనే బాలీవుడ్ నటుడు రితేష్ ను వివాహం చేసుకున్నారు.ఇలా ఈ దంపతులకు ఇదివరకే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇలా భర్త పిల్లలతో జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి జెనీలియా తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం పలు సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి జెనీలియా తాజాగా తన భర్తతో కలిసి ఒక ప్రైవేట్ ఈవెంట్ కి హాజరయ్యారు.

ఈ వేడుకలలో భాగంగా ఈమె బ్లూ కలర్ డ్రెస్ ధరించి సందడి చేశారు. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో జెనీలియా మరోసారి తల్లి కాబోతుందా అన్న సందేహాలు వ్యక్తం చేశారు. ఈ ఫోటోలలో జెనీలియా బేబీ బంప్ ఉన్నట్టు కనిపించడంతో ఈమె మూడోసారి తల్లి కాబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలను వైరల్ చేశారు.

ఇక ఈ వార్తలు వైరల్ గా మారుతూ రితేష్ దేశ్ముఖ్ కంటపడ్డాయి దీంతో ఈ వార్తలపై స్పందిస్తూ జెనీలియా ప్రెగ్నెన్సీ గురించి వస్తున్నటువంటి వార్తలకు క్లారిటీ ఇచ్చారు. జెనీలియా ప్రెగ్నెంట్ అనే వార్తలు వైరల్ కావడంతో అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ ఫోటోలను షేర్ చేసినటువంటి ఈయన నాకు కూడా మరో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు కావాలని కోరికగా ఉంది.

దురదృష్టం జెనీలియా (Genelia) గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో నిజం లేదు అంటూ ఈయన క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ వార్తలకు పులిస్టాప్ పడినట్టు అయింది. ఇలా జనీలియా ప్రెగ్నెంట్ అంటూ వచ్చే రూమర్లలో ఏమాత్రం నిజం లేదని అవన్నీ అవాస్తవాలేనంటూ ఈయన స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus