సెన్సార్ పూర్తి చేసుకున్న ‘జెంటిల్ మన్’..!

  • June 10, 2016 / 01:57 PM IST

నాని నటిస్తున్న తాజా చిత్రం ‘జెంటిల్ మన్’ . మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శుక్రవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ యూ సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రంలో నాని సరసన నివేదితా థామస్, సురభిలు జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను ఇదివరకే విడుదల చేయగా.. ఈ ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు. శ్రీ దేవి మూవీస్ పతాకం పై నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus