Jr NTR, Ram Charan: ‘ఆర్.ఆర్.ఆర్’ హీరోల పై ‘గని’ హీరోయిన్ సయీ మంజ్రేకర్ కామెంట్స్ వైరల్..!

  • April 6, 2022 / 06:01 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గని’. ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సాయి మంజ్రేకర్ ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. ‘దబాంగ్‌3’ లో ఆల్రెడీ ఈమె నటించిన సంగతి తెలిసిందే. తెలుగులో మాత్రం ఇదే ఈమెకి స్ట్రైట్ మూవీ. అల్లు బాబీ, సిద్దు ముద్ద కలిసి ఈ చిత్రాన్ని వరుణ్ తేజ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మించారు.

ఏప్రిల్ 8న ‘గని’ విడుదల కాబోతుంది. ట్రైలర్లో పాత సినిమాల పోలికలు కనిపిస్తున్నప్పటికీ వరుణ్ తేజ్ మూవీస్ కొత్త పంథాలో ఉంటాయి కాబట్టి, పాటలు కూడా హిట్ అయ్యాయి కాబట్టి ఈ మూవీ పై అంచనాలు నెలకొన్నాయి. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ల జోరుని కూడా పెంచారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇందులో భాగంగా హీరోయిన్ సాయి మంజ్రేకర్ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా గురించి ఆ చిత్రం హీరోలైన చరణ్, ఎన్టీఆర్ ల గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఆమె మాట్లాడుతూ.. ” టాలీవుడ్‌లో అల్లు అర్జున్‌, పవన్‌, రాంచరణ్ నాకు ఇష్టమైన హీరోలు. తెలుగు సినిమాలు హిందీ డబ్బింగ్ లో చూస్తాను. రాంచరణ్‌ నటించిన `మగధీర` నాకు ఎంతో బాగా నచ్చింది, అలాగే బన్నీ నటించిన `పుష్ప` చూసి ఫిదా అయిపోయాను. ఇక పవన్‌ కళ్యాణ్‌ ఫాలోయింగ్‌ చూసి ఆశ్చర్యపోయాను. `వకీల్‌సాబ్‌` చూసి నేను బాగా ఎంజాయ్ చేశాను. టాలీవుడ్‌ పై నాకు మంచి రెస్పెక్ట్ ఉంది.రీసెంట్ గా ఆర్.ఆర్.ఆర్ సినిమా చూశాను.

ఈ మూవీలో ‘నాటు నాటు’ సాంగ్లో రాంచరణ్‌, ఎన్టీఆర్‌ డ్యాన్స్ చూసి భయపడిపోయాను. ఆ ఒక్క పాటతోనే ఇద్దరు హీరోలకు పెద్ద ఫ్యాన్ అయ్యాను’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ‘గని’ తర్వాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న ‘మేజర్’ చిత్రంలో కూడా ఈమె నటిస్తోంది. ఈ మూవీ పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus