Ghazi Collections: ‘ఘాజీ’ కి 5 ఏళ్ళు ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
February 17, 2022 / 05:38 PM IST
|Follow Us
రానా ప్రధాన పాత్రలో తాప్సి, సత్యదేవ్,ప్రియదర్శి వంటి వారు కీలక పాత్రల్లో సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఘాజీ’. జలాంతర్గామి నేపథ్యంలో తెరకెక్కిన మొట్టమొదటి ఇండియన్ మూవీ ఇది.అప్పటివరకు భూమ్మీద, సముద్రం మీద, గాల్లో జరిగే యుద్ధాలతోనే ఇండియన్ మూవీస్ రూపొందాయి.అయితే సముద్రం లోపల జరిగే పోరాటాలతో రూపొందిన మొదటి మూవీ ఇదే. ఈ చిత్రానికి 65వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు సినిమా పురస్కారం దక్కింది.
నిజానికి ‘ఘాజీ’ కథని రూ.25 లక్షల బడ్జెట్ తో ఓ షార్ట్ ఫిలింగా రూపొందించాలి అనుకున్నాడు సంకల్ప్ రెడ్డి. కానీ దర్శకుడిని పిలిచి రానా దీనిని బిగ్ స్క్రీన్ పై రూపొందేలా చేసాడు.2017 ఫిబ్రవరి 17న విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. నేటితో ఈ చిత్రం విడుదలై 5 ఏళ్ళు పూర్తికావస్తోంది.
మరి ఫుల్ రన్లో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
4.30 cr
సీడెడ్
0.85 cr
ఉత్తరాంధ్ర
1.52 cr
ఈస్ట్
0.64 cr
వెస్ట్
0.45 cr
గుంటూరు
0.71 cr
కృష్ణా
0.86 cr
నెల్లూరు
0.25 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
9.58 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
14.00 cr
ఓవర్సీస్
2.50 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
26.08 cr
‘ఘాజీ’ చిత్రానికి రూ.18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.26.08 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా బయ్యర్స్ కు రూ.8.08 కోట్ల లాభాలు దక్కాయి. ‘బాహుబలి’ తర్వాత హిందీలో ఈ చిత్రంతో మరో హిట్ ను అందుకున్నాడు రానా.