Salaar: ప్రభాస్ అభిమానులకు పండగ లాంటి అదిరిపోయే శుభవార్త ఇదే!

  • July 18, 2023 / 09:29 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో యావరేజ్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. సలార్ సినిమా మాత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని ప్రభాస్ కెరీర్ ను మలుపు తిప్పుతుందని అభిమానులు భావిస్తున్నారు. సలార్ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే ఈ సినిమా రిలీజ్ కు 100 రోజులు ఉండగా ఈ సినిమా సాంగ్స్, టీజర్ రిలీజ్ కు సంబంధించి క్లారిటీ వచ్చింది.

జులై చివరి వారంలో, ఆగష్టు రెండో వారంలో, ఆగష్టు నాలుగో వారంలో ఈ సినిమాకు సంబంధించిన మూడు అప్ డేట్స్ ఇవ్వాలని సలార్ మేకర్స్ భావిస్తున్నారు. ఈ మూడు అప్ డేట్స్ వస్తే మాత్రం ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. సలార్ సినిమా ఎప్పుడు విడుదలైనా సంచలనాలు సృష్టించడం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సెప్టెంబర్ నెల 28వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సలార్ సినిమా ఏకంగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన సంగతి తెలిసిందే. సలార్ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయనే సంగతి తెలిసిందే. సలార్ సినిమాలో శృతి హాసన్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శృతి హాసన్ ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్ది సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకున్న శృతి హాసన్ సలార్ సినిమాతో సైతం ప్రేక్షకులను మెప్పిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

శృతి హాసన్ ఒక్కో సినిమాకు భారీ రేంజ్ లోనే రెమ్యునరేషన్ తీసుకుంటుండగా ఆమె పారితోషికం మరింత పెంచాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సలార్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని ఆ సన్నివేశాలు ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తాయని అభిమానులు భావిస్తున్నారు. సలార్ మూవీ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. (Salaar) సలార్ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus