‘కార్తీక దీపం’ ఫ్యాన్స్ కు ఆ లోటు తీరిపోయినట్టే..!

  • November 16, 2020 / 05:52 PM IST

‘కార్తీక దీపం’.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సోమవారం నుండీ శనివారం వరకూ సాయంత్రం 7:30 గంటలకు గృహిణులు రిమోట్ ల కోసం వెతుకుతూ లేదా గొడవలు పెట్టుకుంటున్నారు అంటే అది కచ్చితంగా ‘కార్తీక దీపం’ సీరియల్ కోసమే..! పక్కన ఐపీఎల్‌ మ్యాచ్ లు ఉన్నా.. లేక బ్లాక్ బస్టర్ సినిమా టెలికాస్ట్ అవుతున్నా సరే.. వాళ్ళు అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. ఏకంగా ఇండియన్ వైడ్ టెలికాస్ట్ అయ్యే సీరియల్స్ లో నెంబర్ వన్ ప్లేస్ ను సంపాదించుకుందంటేనే అర్ధం చేసుకోవచ్చు ‘కార్తీక దీపం’ క్రేజ్ ఏ రేంజ్లో ఉందనేది.

సరే ఇక అసలు విషయానికి వద్దాం..! గత 10 రోజులుగా డాక్టర్ బాబు(నిరుపమ్) పాత్ర కనిపించడం లేదు. దాంతో ఆ పాత్ర ఇక లేనట్టేనా? లేక నిరుపమ్ ప్లేస్ లో వేరే ఆర్టిస్ట్ ను తీసుకుంటారా? అనే డిస్కషన్లు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. నిరుపమ్ కాకుండా డాక్టర్ బాబు పాత్రలో ఎవ్వరినీ ఊహించుకోలేము. అతను మాత్రమే ఈ పాత్రకు న్యాయం చెయ్యగలడు. అలాంటి నిరుపమ్ లేని ‘కార్తీక దీపం’ ను .. చూడటానికి ఆయన ఫ్యాన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

అయితే డిజప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. అప్ కమింగ్‌ ఎపిసోడ్‌ లో డాక్టర్ బాబు అదే మన నిరుపమ్‌ ఎంట్రీ ఇస్తున్నాడు. తాజా ఎపిసోడ్ లో అందుకు సంబంధించిన ప్రోమోని కూడా చూపించారు.డిస్ని హాట్ స్టార్లో ‘కార్తీక దీపం’ ను వీక్షించే వారికి ఈ విషయం కాస్త ముందుగా తెలుస్తుంది. ఏది ఏమైనా డాక్టర్ బాబు ఫ్యాన్స్ మాత్రం హ్యాపీ అనే చెప్పాలి..!

Most Recommended Video

‘కమిట్‌ మెంటల్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus