హీరో గోపీచంద్ ముఖాన్ని పట్టి పట్టి చూస్తే… ముక్కు మీద ఓ గాటు ఉంటుంది. సినిమా షూటింగ్లో గాయపడటం వల్ల ఆ గాటు వచ్చిందని అనుకుంటుంటారు చాలామంది. అయితే ఆ గాటు వెనుక పెద్ద కథే ఉంది అని చెప్పారు గోపీచంద్. దాంతోపాటు హీరోగా ఎంట్రీ ఇచ్చిన తను, విలన్‌గా ఎందుకు మారాడు అనే విషయం కూడా చెప్పాడు. దాంతోపాటు ప్రభాస్‌తో తనకున్న స్నేహం, తదితర వివరాలను కూడా చెప్పాడు.
చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టడానికి ‘తొలి వలపు’ నిర్మాత ఎం. నాగేశ్వరరావు కారణమని, తానెలా నటిస్తానోనని ఆ చిత్ర దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సందేహించారని గోపీచంద్ చెప్పారు. అలాగే ‘యజ్ఞం’, ‘రణం’, ‘లౌక్యం’, ‘శంఖం’, ‘సాహసం’ అఒటూ వరుసగా తన సినిమా టైటిళ్లు వచ్చినా.. అవి తన సెంటిమెంట్‌తో పెట్టినవి కావని చెప్పాడు గోపీచంద్. ‘సౌఖ్యం’ సినిమా అప్పుడు ఆ టైటిల్ వద్దని చెప్పానని గోపీచంద్ అన్నాడు.
హీరోగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినా… కొన్ని పరిస్థితుల వల్ల విలన్ పాత్రలు చేయాల్సి వచ్చిందని చెప్పాడు గోపీచంద్. ‘తొలి వలపు’ తర్వాత కొన్ని నెలల పాటు తనకు సినిమా అవకాశాలేవీ రాలేదని.. ఆ సమయంలో కృష్ణవంశీ లాంటి దర్శకుల్ని కలిశానని చెప్పాడు. ఇక ప్రభాస్‌తో తనకున్న అనుబంధం గురించి వివరిస్తూ.. గోపీకృష్ణ ఆఫీసులో ప్రభాస్‌ను చూడగానే మంచి నటుడిగా పేరు సంపాదిస్తాడని అనుకున్నట్టు చెప్పారు. ఇంకా తన గురించి, తన సినిమాల గురించి ఎపిసోడ్ టెలీకాస్ట్‌లో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. సో వెయిట్ అండ్ సీ.
ఇక తన ముక్కు మీద గాటు గురించి మాట్లాడుతూ ‘‘మా అన్నయ్య చిన్నప్పుడు నా దగ్గరకు బ్లేడు తీసుకొచ్చి, ముక్కు కోసి పప్పు పెడతా అన్నాడు. ఎలా పెడతావ్ అని నేను అనగానే బ్లేడుతో నా ముక్కు కోసేశాడు. అప్పుడు పెరగన్నం తింటున్నా. అన్నం మొత్తం ఆ రక్తంతో నిండిపోయింది’’ అని గోపీచంద్ చెప్పుకొచ్చాడు. ఆ గాటే అలా ఉండిపోయిందని చెప్పాడు.