ప్రభాస్ పెళ్లి గురించి సంచలన కామెంట్స్ చేసిన గోపిచంద్!
November 28, 2017 / 07:03 AM IST
|Follow Us
ప్రభాస్, గోపిచంద్ వృత్తిపరమైన స్నేహితులు మాత్రమే కాదు… అంతకు మించి. ఇద్దరూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి పోటాపోటీగా వర్షం సినిమాలో నటించారు. అప్పటి నుంచి వీరి బంధం మరింత పెరిగింది. ఆ స్నేహంతోనే ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు. అందుకే మీడియా వారు ప్రభాస్ పెళ్లి గురించి గోపిచంద్ ని అడిగారు. ఆయన ఆ విషయాన్నీ దాటవేయకుండా స్పష్టమైన సమాధానం చెప్పారు. “మొన్నటి వరకు బాహుబలితో బిజీగా ఉన్నందువల్లే పెళ్లి విషయాన్నీ ప్రభాస్ పక్కన పెట్టాడు. ఇప్పుడు కాస్త రిలాక్స్ గా ఉన్నాడు కాబట్టి .. త్వరలోనే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడు” అని వివరించారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ బ్యాచిలర్ టీమ్ లో ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నారు. అతని పెళ్లిని చూడాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. గోపిచంద్ ప్రభాస్ పెళ్లి గురించి చెప్పడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందపడ్డారు. కొంతకాలంగా మంచి విజయం కోసం చూస్తున్న గోపిచంద్ జ్యోతికృష్ణ నటించిన ఆక్సీజెన్ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ నెల 30 న విడుదల కానుంది.