Gopichand: ఆ సినిమా విషయంలో గోపీచంద్ సరైన పనే చేశారా?

  • June 21, 2022 / 04:53 PM IST

గోపీచంద్‌ కథల ఎంపికలో ఏదో తేడా కొడుతోంది. అందుకే వరుస ఫ్లాప్‌లు వస్తున్నాయి అని ఎవరైనా ఈజీగా చెప్పేస్తారు. మధ్యలో ఒకటో రెండో సినిమాలు బాగున్నాయని టాక్‌ వచ్చినా, ఫ్లాప్‌ల వరద మధ్యలో అవి కూడా సరైన విజయం అందివ్వలేకపోతున్నాయి. ఇలాంటి సమయంలో కూడా గోపీచంద్ బాగా జడ్జి చేసి ఓ సినిమా చేయకుండా వదిలేశాడు అని అంటే నమ్ముతారా. కానీ ఇది జరిగింది. ఇప్పుడు చెబుతున్న రానా – సాయిపల్లవి ‘విరాటపర్వం’ గురించే.

‘విరాటపర్వం’ కథను తొలుత వేణు ఉడుగుల గోపీచంద్‌కే చెప్పారట. కథ విని అంతా బాగున్నా… సినిమా అంతా హీరోయిన్‌ మీదే నడుస్తుందని, చేసే హీరోకు పేరు రాదని అన్నాడట గోపీచంద్‌. ఇప్పుడు ‘విరాటపర్వం’ పరిస్థితి చూస్తే అలానే ఉంది. సినిమాలో నటించిన సాయిపల్లవికి మంచి పేరొచ్చింది. అయినా ఆమెకు ఇప్పుడు ప్రత్యేకంగా పేరొచ్చేది ఏమీ లేదు. ఆల్‌రెడీ సూపర్‌ యాక్ట్రెస్‌ అనే పేరు ఉంది. మరోవైపు సినిమా ఫలితం కూడా తేడా కొట్టేసింది.

ఈ మొత్తం లెక్కల ప్రకారం గోపీచంద్‌ మరో ఫ్లాప్‌ నుండి తప్పించుకున్నాడు అని అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. నిజానికి గోపీచంద్‌కి క‌థ చెప్పి ఒప్పించ‌డం చాలా క‌ష్ట‌మ‌ంటుంటారు. అతను చేసిన సినిమాలన్నీ హిట్ అవ్వకపోవొచ్చు. కానీ.. వ‌దులుకున్న సినిమాలు మాత్రం హిట్ అయిన దాఖ‌లాలు లేవు అంటుంటారు. ఇప్పుడు ‘విరాట ప‌ర్వం’ సినిమాతో ఆ మాట మరోసారి మ‌రోసారి రుజువైంది. ఇక గోపీచంద్‌ సినిమాల గురించి చూస్తే…

మారుతి డైరక్షన్‌లో ఆయన నటించిన ‘పక్కా కమర్షియల్‌’ వచ్చే నెల ఒకటో తేదీ విడుదల కాబోతోంది. రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తున్న ఈ కోర్టు డ్రామా సినిమాలో సత్యరాజ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమా టీజర్‌ ఇంట్రెస్టింగ్‌గా అనిపించినా, ట్రైలర్‌ మాత్రం నిరాశపరిచింది. మరి సినిమా ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. ఈ సినిమా ఎప్పుడో పూర్తయినా కరోనా పరిస్థితుల, పెద్ద సినిమా దండయాత్ర వల్ల ఇన్నాళ్లూ ఆగిపోయింది. ఇప్పుడు రిలీజ్‌ చేస్తున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus