Gopichand: ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
March 5, 2024 / 10:09 PM IST
|Follow Us
గోపీచంద్ (Gopichand) హీరోగా తెరకెక్కిన భీమా (Bhimaa) సినిమా ఈ శుక్రవారం అంటే మార్చి 8 న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా గోపీచంద్.. పంచుకున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం:
‘భీమా’ అనే టైటిల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి?
గోపీచంద్ : అది సినిమా చూస్తేనే క్లారిటీగా తెలుస్తుంది. ‘భీమా’ అనే క్యారెక్టర్ నేమ్
ఇందులో మీది డబుల్ రోలా?
గోపీచంద్ : అది రివీల్ చేయకూడదు. డబుల్ షేడ్స్ అయితే ఉంటాయి
ఇందులో మీ పాత్ర పరశురాముడా? బ్రహ్మ రాక్షసుడా ?
గోపీచంద్: రాక్షసుడిని హతమార్చడానికి భగవంతుడు బ్రహ్మ రాక్షసుడి అవతారం ఎత్తుతాడు. అది ట్రైలర్ లో డైలాగ్ కి మీనింగ్( నవ్వుతూ)
భీమా ట్రైలర్ చూశాక చాలా మంది దీనిని అఖండ తో పోలుస్తున్నారు?
గోపీచంద్: పోలిస్తే మంచిదే. అది బ్లాక్ బస్టర్ సినిమానే కదా! ( నవ్వుతూ)
గతంలో మీరు పోలీస్ పాత్రలు చేశారు? భీమా లో చేసిన పోలీస్ పాత్ర ఎంత వైవిధ్యంగా ఉంటుంది అనుకోవచ్చు?
గోపీచంద్: గోలీమార్ (Golimaar) లో నేను చేసిన పోలీస్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే ఆంధ్రుడు లో నేను సస్పెండ్ అయిన పోలీస్ గా ఎక్కువ కనిపిస్తాను. శౌర్యం (Souryam) లో కూడా ఫన్ తో కూడుకున్న పాత్ర. అలాగే భీమా లో పోలీస్ పాత్ర కూడా వేరు.
ప్రొడ్యూసర్ రాధా మోహన్ గారితో 2వ సినిమా చేస్తున్నారు.మీ పై ఆయనకి అంత నమ్మకం ఏంటి?
గోపీచంద్: నిజంగా నాకు కూడా తెలీదు. ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో ఇదే హై బడ్జెట్ మూవీ అట. కానీ బడ్జెట్ పెరిగింది అనే మాట నాతో ఆయన అనలేదు.
మీరు ఇప్పటి వరకు ఇద్దరు హీరోయిన్లతో చేసిన సినిమాలు బాగా తక్కువ. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు?
గోపీచంద్: మెయిన్ గా కథ ప్రకారం ఇందులో ఇద్దరు హీరోయిన్లు అవసరం. (Priya Bhavani Shankar)ప్రియా, (Malvika Sharma) మాలవిక.. ఇద్దరూ చాలా చక్కగా చేశారు.
కన్నడ డైరెక్టర్ తో చేయడం ఎలా అనిపించింది?
గోపీచంద్: అతను కన్నడ డైరెక్టర్ అయినప్పటికీ తెలుగులోనే కథ చెప్పాడు. అతను చెప్పిన కథ నచ్చింది. కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాను. బాగా ఎగ్జిక్యూట్ చేశాడు అనిపించింది
రామబాణం నిరాశపరిచినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు?
గోపీచంద్: అది పాత కథ. కానీ కొత్తగా ప్రెజంట్ చేస్తున్నామని అనుకున్నాము. అదే మిస్ ఫైర్ అయ్యింది. ఆడియన్స్ ఎప్పుడూ కరెక్ట్. వాళ్ళని తప్పుబట్టడానికి యేమీ లేదు.
ఫైనల్ గా భీమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే?
గోపీచంద్: ఇది మంచి కమర్షియల్ సినిమా. అలాగే సోషియో ఫాంటసీ టచ్ కూడా ఉంటుంది.