బ్యాంకాక్ లో గోపీచంద్ యాక్షన్

  • September 21, 2016 / 07:45 AM IST

హాస్యం అనగానే అల్లరి నరేశ్, హుషారు అనగానే రవితేజ మన కళ్ళముందు కదలాడుతారు. అలాగే గోపీచంద్ పేరు తలవగానే యాక్షన్ గుర్తొస్తుంది. తన కెరీర్ కి బ్రేకిచ్చిన యజ్ఞం నుండి గోపీచంద్ యాక్షన్ బాటలోనే సాగుతున్నాడు. మధ్యలో కృష్ణవంశీ ‘మొగుడు’ సినిమాతో ఏదో ప్రయత్నించినా అది బెడిసికొట్టింది. కామెడీ ట్రెండ్ ఫాలో అయ్యి చేసిన ‘లౌక్యం’, ‘శౌఖ్యం’ ఉన్న సుఖాన్ని లేకుండా చేశాయి. దాంతో గోపి యు టర్న్ తీసుకుని మళ్ళీ యాక్షన్ బాట పట్టాడు.

జ్యోతికృష్ణ దర్శకత్వంలో ‘ఆక్సిజన్’ సినిమా పూర్తిచేసిన గోపీచంద్ సంపత్ నందితో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. భగవాన్, పుల్లారావు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ రేపటినుండి బ్యాంకాక్ లో జరుగనుంది. హీరో, హీరోయిన్, విలన్ పరిచయ సన్నివేశాలతో పాటు విరామ సమయంలో వచ్చే సన్నివేశాలు అక్కడే చిత్రీకరించనున్నారు. మాస్ దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న సంపత్ నంది తన సినిమాల్లో పోరాటాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాడు. రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో ఈ సినిమాలోనూ కార్ ఛేజ్ లు, గుర్రాల హంగామాతో భారీ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నాడట. హన్సిక, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాలో ముఖేష్ రిషి, నిఖితన్ దీర్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రధారులు. సంగీతం :తమన్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus