Gopichand , Ravi Teja: గోపీచంద్ -రవితేజ సినిమాలు అలా ఎక్చేంజ్ అయ్యాయట..!
January 28, 2023 / 11:38 AM IST
|Follow Us
ఆఫ్ బీట్ సినిమాలకు అయితే దర్శకులు ముందుగా కథ రాసుకుని ఆ తర్వాత హీరోలను వెతుక్కుంటారు. అదే కమర్షియల్ సినిమాలకు అయితే హీరోలను దృష్టిలో పెట్టుకునే కథలు రాసుకుంటూ ఉంటారు దర్శకులు. అయితే ఏ హీరోనైతే దృష్టిలో పెట్టుకుని ఓ దర్శకుడు కథ రాసుకుంటాడో.. ఆ హీరోనే ఆ కథ చేస్తాడు అని కచ్చితంగా చెప్పలేము. ఇందుకు చాలా ఎగ్జామ్పుల్స్ ఉన్నాయి. అందులో ఒకదాని గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం.
ప్రముఖ దర్శకుడు కమ్ రైటర్ అయిన బీవీఎస్ రవి.. రవితేజ ను దృష్టిలో పెట్టుకొని ఓ కథ రాసుకున్నాడు. అదే ‘వాంటెడ్’ మూవీ కథ. ఇది రవితేజకి నచ్చింది. కానీ బీవీఎస్ రవితో పాటు కోన వెంకట్ కూడా వచ్చి రవితేజకి ‘డాన్ శీను’ కథ చెప్పారట. రవితేజ ‘డాన్ శీను’ ఓకె చేయడం జరిగింది. దీంతో బీవీఎస్ రవి.. వెళ్లి ప్రభాస్ ను కలిశాడట. అతను సెకండ్ హాఫ్ మార్చమని చెప్పాడట.
ఈ క్రమంలో దిల్ రాజు.. రవిని కలిసి ‘ప్రభాస్ కు కథ చెప్పావట.. సెకండ్ హాఫ్ నచ్చలేదట కదా’ అన్నాడట. దీంతో డిజప్పాయింట్ అయిన రవి వెళ్లి పూరిని కలిశాడు. అప్పటికి గోలీమార్ చేస్తున్న పూరి.. గోపీచంద్ ను రవి తెచ్చిన కథ వినమని చెప్పాడట.విచిత్రం ఏంటంటే దర్శకుడు గోపీచంద్ మలినేని ఆల్రెడీ గోపీచంద్ ను కలిసి ‘డాన్ శీను’ కథ చెప్పాడు. అది గోపికి నచ్చింది.
అలాగే రవి చెప్పిన ‘వాంటెడ్’ కథ కూడా గోపీచంద్ కు నచ్చింది. రవి ఓ ప్రొడ్యూసర్ పేరు చెబితే గోపీచంద్ కాదని చెప్పి ‘భవ్య క్రియేషన్స్’ ఆనంద్ ప్రసాద్ తో చేద్దామని చెప్పారట. ఇలా రవితేజ చేయాల్సిన ‘వాంటెడ్’ గోపీచంద్ కు.. ‘గోపీచంద్’ చేయాల్సిన ‘డాన్ శీను’ రవితేజకు వెళ్ళింది. కాకపోతే ‘డాన్ శీను’ హిట్ అయ్యింది.. ‘వాంటెడ్’ ప్లాప్ అయ్యింది. మొదటి సారి డైరెక్షన్ చేయడం వల్ల తడబడ్డానని.. బీవీఎస్ రవి లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.